Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ యాక్టింగ్ కమల్‌దే.. నా యాక్టింగ్ నాదే... : శృతి హాసన్

శృతిహాసన్‌కి ఉన్న గ్లామర్ ఫాలోయింగ్ ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌కి లేదనే చెప్పాలి. అటు గ్లామర్ పరంగానూ, ఇటు యాక్టింగ్ పరంగా శృతిహాసన్ వరుస ఆఫర్స్‌ని అందుకుంటుంది. శృతిహాసన్ ఏం చేసినా

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (13:54 IST)
శృతిహాసన్‌కి ఉన్న గ్లామర్ ఫాలోయింగ్ ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌కి లేదనే చెప్పాలి. అటు గ్లామర్ పరంగానూ, ఇటు యాక్టింగ్ పరంగా శృతిహాసన్ వరుస ఆఫర్స్‌ని అందుకుంటుంది. శృతిహాసన్ ఏం చేసినా సంచలనమే అని అంటున్నారు సినీజనాలు. తాజాగా ఈ బ్యూటీ నటించిన ప్రేమమ్ చిత్రం మంచి సక్సెస్‌ని అందుకుంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరో వారసురాలిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతి నటనను చూసి కొంతమంది ఆమె కాస్త తగ్గాలని మొదట్లో కామెంట్స్ చేశారు. కానీ వాళ్ళందరికీ శృతీ హాసన్ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చింది. 
 
ఇక ఈ మధ్య ప్రేమమ్ సినిమా విషయంలో కూడా చాలా మందితో పోల్చి తన యాక్టింగ్‌ని కామెంట్ చేస్తున్నవాళ్ళకు కూడా ఇప్పుడు అదే రేంజ్‌లో రిప్లై ఇచ్చింది. ''నేను హీరోయిన్‌గా పరిచయం అయినప్పుడు అందరూ నా నటనను, కమల్ హాసన్‌ని నటనను పోల్చి చూశారని, అయితే నేను మాత్రం ఆ విషయం అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అయినా ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు నటిస్తుంటారు. ఇక పోలికలు ఎందుకు? కమల్ యాక్టింగ్, కమల్‌దే. నా యాక్టింగ్ శైలి నాదే. 
 
అలాగే ప్రేమమ్ సినిమా విషయంలో కూడా సేం టు సేం. సాయిపల్లవికి, నాకూ పోలికలు ఎందుకు? ఆ అమ్మాయి తన స్టైల్‌లో చేసింది. నేను నాకు నచ్చినట్టుగా చేసేశా. ఆ మాత్రం దానికి పోల్చి చూడాల్సిన అవసరం ఏముంది? మీకు ఎవరి యాక్టింగ్ నచ్చితే వాళ్ళ యాక్టింగ్ చూసి ఎంటర్టైన్ అవ్వండి అని తనదైన స్టైల్‌లో కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments