Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మ.. నాన్న పెళ్లికి ముందే పుట్టాను.. తప్పేంటంటున్న టాప్ హీరోయిన్.. ఎవరు?

టాలీవుడ్‌లో ఐరెన్‌ లెగ్‌గా ముద్రవేయించుకుని ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎగిన భామ శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె. ఏ విషయంలోనైనా బోల్డ్‌గా ఉంటుంది. ఏమాత్రం దాపరికాలు ఉండవు. ఆమె ఓ విషయంప

Webdunia
శనివారం, 8 జులై 2017 (10:12 IST)
టాలీవుడ్‌లో ఐరెన్‌ లెగ్‌గా ముద్రవేయించుకుని ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎగిన భామ శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె. ఏ విషయంలోనైనా బోల్డ్‌గా ఉంటుంది. ఏమాత్రం దాపరికాలు ఉండవు. ఆమె ఓ విషయంపై తన మనసులోని మాటను కుండబద్ధలు కొట్టినట్టు చెపుతోంది. అందేంటో చూద్ధాం.
 
'ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న కల ఉంటుంది. నేను మా అమ్మ, నాన్న పెళ్లికి ముందే పుట్టాను. అది మీరు తప్పనుకుంటే దానికి నేనేం చేయగలను!' అని ప్రశ్నిస్తోంది. అదేసమయంలో నిజజీవితంలో మా తండ్రీకూతుళ్ళ మధ్య అనుంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌. సెట్స్‌లో మేము ప్రొఫెషనల్‌గానే ఉంటాం. తండ్రీకూతుళ్లుగానే నటిస్తున్నా మా పాత్రలు నిజజీవితానికి భిన్నంగా ఉంటాయన్నారు. 
 
పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతానని తాను చెప్పడం పెద్ద వివాదంగా మారింది. పైగా దీనిపై వివరణ కూడా ఇచ్చేశాను. ఇప్పుడు కూడా మీరు ‘పెళ్లెప్పుడు?’ అనడిగితే... తెలీదనే చెబుతాను. ఎందుకంటే, పెళ్లనేది పెద్ద కమిట్‌మెంట్‌. స్వతంత్రంగా ఉన్న వ్యక్తి మరో వ్యక్తితో బాధ్యతలను పంచుకోవడం బిగ్‌ కమిట్‌మెంట్‌. ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను. అప్పుడూ అదే చెప్పాను.
 
ఆ తర్వాత ‘మిమ్మల్ని తల్లిగా చూడొచ్చా’ అనడిగినా ‘తప్పకుండా’ అని చెప్తాను. ‘భవిష్యత్తులో తల్లి కావాలనుకుంటున్నాను’ అన్నాను. ఆ రెండు సమాధానాన్ని కలిపి.. ‘పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతాను’ అని చెప్పినట్లు వదంతులు పుట్టించారు. ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న కల ఉంటుంది. నేను మా అమ్మ, నాన్న పెళ్లికి ముందే పుట్టాను. అది మీరు తప్పనుకుంటే దానికి నేనేం చేయగలను అని నిర్మొహమాటంగా శృతిహాసన్ చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments