Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్ క్రికెటర్‌ బ్రావోతో డేటింగ్ చేస్తున్న నటి శ్రియా

నందమూరి నట సింహం బాలకృష్ణ తన వందో సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రలో నటిస్తున్నారు. శాతకర్ణి జోడిగా రాణి పాత్రలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ భామ గురించి ఓ ఆసక్తకర వార్త టాలీవుడ్‌లో హల

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (12:08 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ తన వందో సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రలో నటిస్తున్నారు. శాతకర్ణి జోడిగా రాణి పాత్రలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ భామ గురించి ఓ ఆసక్తకర వార్త టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. శ్రియా శరణ్... వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, డ్యాన్సింగ్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోతో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు పుట్టుకొచ్చాయి. 
 
విండీస్‌ క్రికెటర్‌ అయినప్పటికీ భారత్‌ అంటే బ్రావోకు ఎంతో ఇష్టం. ఐపీఎల్‌తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ, పాటలు పాడుతూ, ఓ హిందీ రియాల్టీ షోలో పాల్గొంటూ ఇండియాతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఇప్పటికే చాలా మందితో పబ్లిక్‌గా మీడియా కంటపడిన శ్రీయా శరణ్.. తాజాగా బ్రావోతో కనిపించింది. శ్రియ, బ్రావో డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 
 
ముంబై శివార్లలోని ఓ రెస్టారెంట్‌కు తరచుగా వెళ్తుంటారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల వారిద్దరూ ఆ రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తూ మీడియా కంటికి చిక్కారు. ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్తున్నా వారు డోంట్‌కేర్‌ అన్నట్టుగా వ్యవహరించారు. దీనితో వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. 
 
అంతవరకు బాగానే ఉన్న.. లోపలి నుంచి కలిసి బయటకి వచ్చిన వీరిద్దరు..బయటకి రాగానే ఎవ్వరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు. మరి ఇది మరో కొత్త సంబంధమా... అని అనుమానం కలిగిస్తోంది. ఈ విషయంపై శ్రీయా నోరు విప్పితేకానీ అసలు విషయం తెలియదు మరి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments