Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న బయోపిక్‌లో నేనా? అదో కన్ఫ్యూజన్: బాలయ్యకు దెబ్బేసిన చెర్రీ

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (15:36 IST)
బయోపిక్ మూవీస్. ఇలాంటి చిత్రాల్లో తెలుగుకి సంబంధంచి మహానటి సావిత్రి బయోపిక్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఐతే బాలయ్య నటించిన నటరత్న ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం బోర్లా పడింది. దీనికి సవాలక్ష కారణాలు చెప్పేశారు చాలామంది. ఏదేమైనప్పటికీ బయోపిక్ తీయాలంటే ఖలేజా వుండాలంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు సినీ జనం.
 
ఇక అసలు విషయానికి వస్తే ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కించాలంటూ హడావుడి జరిగింది. సైరా సక్సెస్ తర్వాత మరోసారి మెగాస్టార్ చిరు బయోపిక్ పైన చర్చ మొదలైంది. ఈ బయోపిక్ చిత్రంలో చిరంజీవి పాత్రలో చెర్రీ నటిస్తాడంటూ ప్రచారం కూడా జరిగింది. దీనిపై చెర్రీని కదిలిస్తే డిఫరెంటుగా స్పందించాడు.
 
అసలు మా నాన్నగారి సినిమాలను రీమేక్ చేయాలంటేనే పెద్ద సాహసం. ఆయన చిత్రాల్లో కొన్ని పాటలను తీసుకుని వాటిని సక్సెస్ చేసేందుకు కిందామీద పడుతుంటాం. అలాంటిది ఆయన జీవితాన్ని తెరపైకి ఎక్కించడం, అందులోనూ నేను నటించడం అంటే మామూలు విషయం కాదు. సరే... నాన్నగారిలా నేను నటిస్తాను. మరి నా పాత్రను ఎవరు చేస్తారు? ఇదో పెద్ద కన్ఫ్యూజన్. 
 
కాబట్టి నాన్నగారి బయోపిక్ లో నేను చేయను అని చెప్పేశాడు. ఐతే ఈ మాటలు ఎక్కడో తగులుతున్నట్లున్నాయి. అదే బాలయ్య ఆయన నాన్న ఎన్టీఆర్ పాత్రలో నటించిన చిత్రం యన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. పైగా చిత్రంలో పస లేదంటూ చాలామంది పెదవి విరిచారు. వీటన్నిటినీ చూసి కాబోలు చెర్రీ అలా స్పందించాడు. ఎటొచ్చి బాలయ్యకు ఇండైరెక్టుగా దెబ్బేసినట్లు అనిపిస్తోంది కదూ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments