Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు గుండెలున్న జీవిని ఎలా తింటారు.. కానీ సెట్స్‌లో ఇదే నా స్పెషల్ : షారూఖ్ ఖాన్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ఇమేజ్ సొంతం చేసుకున్న బాద్షా షారూఖ్ ఖాన్ సెపరేట్ రూట్ మారుస్తున్నాడు. తన తోటి నటులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు వరుసగా ప్రయోగాలు చేస్తుండటంతో షారూ

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (15:30 IST)
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ఇమేజ్ సొంతం చేసుకున్న బాద్షా షారూఖ్ ఖాన్ సెపరేట్ రూట్ మారుస్తున్నాడు. తన తోటి నటులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు వరుసగా ప్రయోగాలు చేస్తుండటంతో షారూఖ్ కూడా ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ఆ మధ్య ఫ్యాన్ చిత్రంతో కాస్త రూట్ మార్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయినా షారూఖ్ మరోసారి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రాయిస్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన షారూఖ్ ప్రస్తుతం లిస్బన్‌లో జరుగుతున్న ''ది రింగ్'' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. 
 
ఇంతియాజ్‌ ఆలీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ డ్రామా చిత్రంలో షారూఖ్‌ సరసన అనుష్కశర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్‌లో పాల్గొన్న షారుఖ్ లంచ్‌లో ఎప్పుడూ తినేదేకాకుండా ఏదన్నా కొత్తరకం వంటకాన్ని రుచి చూడాలని ఆక్టోపస్‌ ఆర్డర్‌ చేశాడట. ఈ విషయాన్ని ఫొటోతో సహా షారుక్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ''సెట్స్‌లో ఇది నా లంచ్‌. ఇంత భయంకరంగా మూడు గుండెలున్న ఈ జీవిని ఎలా తింటారు'' అంటూ ట్వీట్‌ చేశాడు. 
 
షారుక్‌ ది రింగ్‌ చిత్రీకరణ ఎక్కువగా యూరప్‌లోని ప్రేగ్‌, ఆమ్‌స్టర్‌డ్యాం, లిస్బన్‌ తదితరప్రాంతాల్లో జరుగుతోంది. దాంతో షారుక్‌కి భారత్‌దేశంలో దొరకని వంటలన్నీ అక్కడ ట్రై చేయాలన్న ఆలోచన వచ్చిందేమోనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే రోజుకో కొత్త రకం వంటకాన్ని పూటుగా లాగించేస్తున్నాడు ఈ కింగ్ ఖాన్. ఈ చిత్రంలో షారుక్‌ టూరిస్ట్‌ గైడ్‌గా, అనుష్క శర్మ గుజరాతీ అమ్మాయిగా నటిస్తున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments