ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ కథానాయకుడిగా 'సర్కార్-3' చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన సర్కార్, సర్కార్-2లతో పోలిస్తే ఈ చిత్రం మరింత భారీ స్థాయ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ కథానాయకుడిగా 'సర్కార్-3' చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన సర్కార్, సర్కార్-2లతో పోలిస్తే ఈ చిత్రం మరింత భారీ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఇటీవల అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని, తొలి రెండూ భాగాల కంటే భావోద్వేగభరితంగా సాగే చిత్రమిదని అమితాబ్‌బచ్చన్ పేర్కొన్నారు.
ఈ సినిమాలో బిగ్‌బీతో పాటు యామీ గౌతమ్, మనోజ్ బాజ్‌పాయ్, రోనిత్ రాయ్, మిత్ సాధ్, జాకీ ష్రాఫ్, భరత్ దబోల్కర్, రోహిణి హట్టగండి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు పేర్కొని వారి పాత్రలను కూడా పరిచయం చేశాడు. టాలీవుడ్‌లో ''గౌరవం'' సినిమాలో శిరీష్ సరసన నటించిన యామీ గౌతమ్, తెలుగులో చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకోకపోయినా మొత్తానికి రాంగోపాల్ వర్మ దృష్టిలో పడింది.
ఇప్పటివరకు అందంగా, గ్లామరస్ పాత్రల్లో కనిపించిన యామీ, ఈ సినిమాలో తన తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని చంపాలనే, పగతో రగిలిపోయే యువతి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యామీగౌతమ్ అన్ను కర్కరే పాత్రని పోషిస్తోంది. ఆ పాత్రలో ఆమె ఫెరోషియస్‌గా కనిపించబోతోందట. ఆ లుక్‌ని కూడా వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. వర్మ విడుదల చేసిన ఫొటోల్లో ఉన్న హీరోయిన్ యామీ గౌతమ్ అనే విషయాన్ని మొదట ఎవ్వరూ గుర్తు పట్టలేదు. వర్మ ఆమె ఆకృతిని అంతగా మార్చేశాడు. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాని ఏప్రిల్, మే నాటికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు.