Webdunia - Bharat's app for daily news and videos

Install App

యావరేజ్ 'సరైనోడు'.. ఎవరూ ఊహించని కలెక్షన్లు కురిపిస్తోంది : రూ.70 కోట్లు దాటింది

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (14:29 IST)
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను క్రేజీ కాంబోలో రూపొందిన చిత్రం 'సరైనోడు'. గత నెల ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటి షో నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఒక్క ఓవర్సీస్‌లో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు స్టైలిష్ పాత్రలే చేసిన బన్నీ ఈ చిత్రంతో ఊర మాస్ పాత్రలు చేసి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 
 
లవర్‌బాయ్‌గానే కాకుండా మాస్ హీరోగా కూడా చేయగలనని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ఈ చిత్రం రిలీజైన మొదటి పది రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ని అందుకుంది. భారీ అంచనాలతో 'బ్రహ్మోత్సవం' సినిమా రిలీజై దానికి నెగిటివ్ టాక్ రావడంతో మరో వారం 'సరైనోడు' హవా కొనసాగించవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 
 
'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ అవ్వడం ఈ సినిమాకి అదృష్టంగా నిలిచింది. రూ.70 కోట్ల మార్క్‌ని బన్నీ కేవలం 33 రోజుల్లోనే సాధించాడు. సమ్మర్ హాలిడేస్‌ని పూర్తిగా క్యాష్ చేసుకున్న సినిమా కూడా ఇదే. తొలి రెండు వారాలు వసూళ్ళు మాత్రం బాగా కురిపించింది. ఆ తర్వాత రెండు వారాలు కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో పరవాలేదనిపించింది. 5 రోజుల్లో రూ.68.36 కోట్లు వసూలు చేసిన సరైనోడు, మరో కోటిన్నర మార్క్ అందుకోవడానికి నాలుగు రోజులు తీసుకున్నాడు. మొత్తానికి యావరేజ్‌గా ఉండాల్సిన ''సరైనోడు'' ఎవరో ఊహించని రేంజ్‌లో 70 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ లిస్టులో చేరడంతో బన్నీఅభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments