టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సమంత అక్కినేని ఒకరు. ఆమె ఇటీవల శాకుంతలం కోసం షూట్ పూర్తి చేసింది. లాక్ డౌన్లో ఉత్త చేతులతో ఖాళీగా లేకుండా రెండు చేతులతో సంపాదిస్తోంది సమంత. ఇది కాస్త ఆసక్తికరంగానే వుంది.
ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న తారల్లో ఆమె ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ చేస్తే దానికిగాను ఏకంగా సమంత 25 నుండి 30 లక్షల రూపాయలు పొందుతున్నట్లు టాలీవుడ్ పిల్లజర్నలిస్టులు చెప్పుకుంటున్నారు.