Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత చైతూ కోసం ఎన్నో చేసింది.. కానీ చివరికి విడాకులే మిగిలాయ్!

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:01 IST)
స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఎక్కువమంది సమంతదే తప్పు అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సమంత గురించి వెలుగులోకి వస్తున్న విషయాల వల్ల చైతన్య కోసం సమంత ఎన్నో త్యాగాలు చేసిందని టాక్ వచ్చింది. విడాకుల ప్రకటన తర్వాత అటు చైతన్య ఇటు సమంత సినిమాలపరంగా బిజీ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో మొదట హీరోయిన్‌గా సమంత ఎంపికయ్యారు.
 
అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కోసమే ఈ పాన్ ఇండియా మూవీలో సమంత ఆఫర్‌ను వదులుకున్నారని సమాచారం. సమంత నో చెప్పడంతో ప్రస్తుతం ఆ సినిమాలో నయనతార నటిస్తున్నారు. పెళ్లి తర్వాత సమంత గ్లామర్ రోల్స్ విషయంలో పరిమితులను విధించుకున్నారు. 
 
అక్కినేని ఫ్యామిలీ గౌరవాన్ని పెంచే సినిమాలలో మాత్రమే సమంత ఎక్కువగా నటించడానికి అంగీకరించారు. హీరోయిన్‌గా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్న సమయంలోనే సమంత ఆఫర్లు తగ్గుతాయని తెలిసినా చైతన్యను పెళ్లి చేసుకున్నారు.
 
అయితే చైసామ్ విడిపోవడానికి అసలు కారణం మాత్రం వెలుగులోకి రావడం లేదు. రెండు నెలల క్రితం వరకు అన్యోన్యంగా ఉన్న చైసామ్ జోడీ విడిపోయి నెటిజన్లకు భారీ షాకివ్వడం గమనార్హం. సమంత తాజాగా రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించగా ఆ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. సమంత నటించిన శాకుంతలం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments