Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రియను పెళ్లి చేసుకోనున్న అడవి శేషు.. సమంత ఫుల్ సపోర్ట్

Samantha
Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:06 IST)
విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్న అడవి శేషు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. హీరో సుమంత్‌కు తోబుట్టువు, అక్క అయిన యార్లగడ్డ సుప్రియ నటిగా, నిర్మాతగా సుప్రసిద్ధులు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
 
ఇటీవల అడవి శేషు విడుదలైన ''గూఢచారి'' మంచి హిట్ సాధించింది. ఇందులో వీరిద్దరూ కలిసి పని చేసారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నప్పుడు వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆపై స్నేహ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరి నిర్ణయాన్ని అక్కినేని ఇంటి కోడలు సమంత బాగా సపోర్ట్ చేసి, వీరి పెళ్లికి ఎంతో సహాయం చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
 
సుప్రియ 20 ఏళ్ల క్రితం "అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి" సినిమాలో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా హిట్ కాకపోవడంతో నటనకు ఫుల్‌స్టాప్ పెట్టి, నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియో నిర్వాహకురాలిగా మారారు. మళ్లీ ఇప్పుడే గూఢచారి సినిమాలో కనిపించారు. ఇందులో మరో విశేషమేమిటంటే, సుప్రియ వయస్సులో శేషు కంటే పెద్దది. ఈ విషయాన్ని ఇంకా అఫిషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments