Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది జరగదు అనుకుంటే అదే జరుగుతుంది... సమంత

టాలీవుడ్‌లో గతకొంతకాలంగా హల్ చేస్తోన్న "నాగ చైతన్య-సమంత"ల పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఇద్దరు "మనం" సినిమా టైమ్ నుంచే ప్రేమలో పడ్డారని అందరికి తెలిసిన విషయమే. "బ్రహ్మోత్సవం" సినిమా విడుదల సమయంల

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (12:03 IST)
టాలీవుడ్‌లో గతకొంతకాలంగా హల్ చేస్తోన్న "నాగ చైతన్య-సమంత"ల పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఇద్దరు "మనం" సినిమా టైమ్ నుంచే ప్రేమలో పడ్డారని అందరికి తెలిసిన విషయమే. "బ్రహ్మోత్సవం" సినిమా విడుదల సమయంలో "నాకో బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అని సమంత స్టేట్మెంట్ ఇచ్చినప్పప్పుడే అందరూ "ఇంకెవరూ నాగచైతన్య అయ్యుంటాడు" అని బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. 
 
ఆ తర్వాత వారి నమ్మకమే నిజం అయ్యిందనుకోండి. అనంతరం"నాగచైతన్య-సమంత"లు త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. వచ్చే నెలలో ఈ ఇద్దరి నిశ్చితార్ధం అట్టహాసంగా సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుందని వార్తలు వెలువడ్డాయి. మొత్తానికి నాగచైతన్య-సమంతల ప్రేమ వ్యవహారం సూపర్ సక్సెస్ అయ్యి.. పెళ్లి వరకూ రావడంతో ఆ ఇద్దరి సన్నిహితులతోపాటు సినిమా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ విషయంపై సమంత మాట్లాడుతూ ''నా ప్రయాణం తలచుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.. ఏది జరగదు అనుకుంటే అదే జరుగుతుంది. నేను సినిమాల్లోకి వస్తానని, వచ్చినా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని కలలో ఊహించలేదు. నా జీవితం, నేను పొందుతున్న సౌకర్యాలు, సంపాదించిన పేరు ఇవన్నీ నిజమేనా అనిపిస్తుంది. కలలా మాయమైపోతాయేమో అనే బెంగ ఒక్కోసారి కలుగుతుంటుంది. ఏ మనిషికీ తృప్తి ఉండదు అంటుంటారు. కానీ నాకు అలా కాదు. ప్రతి విషయంలోనూ అంతులేని సంతృప్తి దొరికింది'' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments