Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్స్ కోసం విశాల్ పాకులాట.. పందెంకోడి 2లో విశాల్‌తో జతకట్టనున్న సమంత?

సౌత్‌లో సమంత హవా మాములుగా లేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో.. సౌత్‌ని షేక్ చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పటివరకు నెం.1 హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సత్తాచాటిన ఈ అమ్మడు… ఇప్పుడు ఫోకస్ సొంత స్టేట్ పైకి షిప్ట్ చేసింది.

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (16:02 IST)
సౌత్‌లో సమంత హవా మాములుగా లేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో.. సౌత్‌ని షేక్ చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పటివరకు నెం.1 హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సత్తాచాటిన ఈ అమ్మడు… ఇప్పుడు ఫోకస్ సొంత స్టేట్ పైకి షిప్ట్ చేసింది. ఇక్కడ టాప్ హీరోలతో వరుస హిట్లు కొడుతూ గోల్డెన్ లెగ్ బ్యూటీగా సందడి చేసిన సమంత.. కోలీవుడ్‌లో మాత్రం స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. 
 
ఈ నేపథ్యంలోనే విశాల్ సరసన నటించడానికి కూడా సమంత ఒప్పుకుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజులుగా విజయం విశాల్ ముఖంవైపు కన్నెత్తి చూడడం లేదు... దాంతో ఈ సారి ఎలాగైనా ఓ మంచి సబ్జెక్ట్‌తో జనాన్ని ఆకట్టుకోవాలని విశాల్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన 'పందెంకోడి'కి సీక్వెల్ నిర్మించాలని యోచిస్తున్నాడు విశాల్.
 
ఈ చిత్రంలోనే తన సరసన నాయికగా సమంతను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు. విశాల్ 'పందెంకోడి' చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించగా, ఆయన దర్శకత్వంలోనే 'పందెంకోడి'కి సీక్వెల్ రూపొందించాలని విశాల్ భావిస్తున్నాడు. తాజాగా సమంతకు దర్శకుడు లింగుస్వామి కథని వినిపించాడని, కథ నచ్చడంతో 'పందెంకోడి 2'లో నటించేందుకు అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
త్వరలో ఈ 'పందెంకోడి 2' సినిమాకి సమంత డేట్స్ కేటాయించే అవకాశం ఉన్నదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ చిత్రంలో సమంతతో పాటు నిత్యా మీనన్ కూడా ఓ నాయికగా నటించనుందట. ఈ సారి విశాల్ 'పందెంకోడి' సీక్వెల్‌లో సమంత, నిత్యా మీనన్ కలసి నటించబోతున్నారు. మరి ఈ సినిమా విశాల్‌కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments