Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా వేదికగా సామ్ - చై వివాహం... న్యూయార్క్‌లో హనీమూన్!

తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు గుర్తింపు పొందారు. త్వరలోనే వీరిద్దరు ఓ ఇంటివారు కానున్నారు. ఈ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (14:11 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు గుర్తింపు పొందారు. త్వరలోనే వీరిద్దరు ఓ ఇంటివారు కానున్నారు. ఈ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి అక్టోబ‌ర్ ఆరో తేదీన త‌మ‌ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని చైతూ ఇప్ప‌టికే అధికారికంగా ప్రకటించారు. కానీ, వేదిక ఎక్కడ అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇపుడు ఓ స్పష్టత వచ్చింది.
 
సామ్- చై వివాహం గోవా వేదిక‌గా మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న‌ట్టు ఫిలిం న‌గ‌ర్ వర్గాల సమాచారం. వీకెండ్ వెడ్డింగ్ హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నుంది. ఈ వివాహ వేడుక‌కి కేవ‌లం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులతోపాటు, నాగార్జునతో మంచి సంబంధాలు కలిగిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు.
 
ఇక తొలి రోజు హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి జ‌ర‌ుగ‌నుండగా, రెండో రోజు గోవాలోని ఓ చ‌ర్చిలో క్రిస్టియ‌న్ వెడ్డింగ్ జ‌రుపుతార‌ట‌. అక్క‌డ రింగ్స్ మార్చుకొని ప్ర‌తిజ్ఞ చేస్తార‌ట‌. ఇక వెడ్డింగ్ త‌ర్వాత హ‌నీమూన్‌కి న్యూయార్క్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, 40 రోజుల పాటు యూఎస్ మొత్తం క‌వ‌ర్ చేసి వ‌స్తార‌ని స‌మాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవర్నైనా వదిలేస్తా కానీ ఆ లంగా గాడిని వదలను: మద్యం మత్తులో వర్థమాన నటి చిందులు (Video)

Shivaratri: శివరాత్రికి ముస్తాబవుతున్న హైదరాబాద్ శివాలయాలు

భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం: ఢిల్లీ నుంచి జైపూర్‌కి 30 నిమిషాల్లో...

Kolkata: బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం: కోల్‌కతా వద్ద రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Young driver: ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌‌లో వ్యక్తి హత్య.. నేర చరిత్ర.. ముఠాలో చేరలేదని ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments