Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌కు తలనొప్పి తెప్పిస్తోందట కాబోయే కోడలు... ఏ కోడలు...?

అక్కినేని నాగార్జున వచ్చే సంవత్సరం 2017లో తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ పెళ్లిళ్లు చేయబోతున్నారు. ఐతే ఇద్దరు కొడుకులు ప్రేమించిన అమ్మాయిలతోనే పెళ్లిళ్లు చేసేందుకు నాగార్జున-అమల దంపతులు ఒప్పుకున్నారు. నిజంగా ప్రేమికుల కోర్కెలను అంగీకరించిన నాగార

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (14:35 IST)
అక్కినేని నాగార్జున వచ్చే సంవత్సరం 2017లో తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ పెళ్లిళ్లు చేయబోతున్నారు. ఐతే ఇద్దరు కొడుకులు ప్రేమించిన అమ్మాయిలతోనే పెళ్లిళ్లు చేసేందుకు నాగార్జున-అమల దంపతులు ఒప్పుకున్నారు. నిజంగా ప్రేమికుల కోర్కెలను అంగీకరించిన నాగార్జున-అమల దంపతులు గ్రేట్ కదా. ఇప్పటికే అఖిల్ ఎంగేజ్‌మెంట్ అతడి ప్రేయసి శ్రియా భూపాల్‌రెడ్డితో ఘనంగా జరిపించేశారు. 
 
త్వరలో పెద్ద కుమారుడు నాగచైతన్య, అతడి ప్రేయసి, నటి సమంతతో నిశ్చితార్థం జరుగుతుందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఈ వార్తలను నాగ్ అంతగా మీడియాకు చెప్పడంలేదు. కేవలం శుభకార్యం జరిగిన రోజు మాత్రమే ఏదో అలా ఫోటోలు బయటకు వస్తున్నాయి. మినహా మరెలాంటి వార్తలు బయటకు రావడంలేదు. 
 
ఐతే కాబోయే పెద్దకోడలు సమంత మాత్రం తమ పెళ్లి విషయాలపై మీడియాకు లీకులిస్తోందని నాగ్ కాస్త కోపంగా ఉన్నారట. అఖిల్ పెళ్లి తర్వాతే నాగచైతన్య-నేను వివాహం చేసుకుంటామని ఇటీవల ఓ ఇంటర్వ్వూలో సమంత చెప్పడంపై నాగార్జున అసహనం వ్యక్తం చేసినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే నాగ్... ఇలాంటివి చాలా ఈజీగా తీసుకుంటారనీ, మరీ అంత పట్టింపులు పోరనీ మరికొందరు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments