Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌కు ఐరన్ లెగ్.. టాలీవుడ్‌కు గోల్డెన్ లెగ్.. విజయ్ మాత్రం సమంత హిట్ ఇచ్చిందా?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2016 (14:55 IST)
'ఏ మాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత తెలుగులో మంచి పాత్రలను ఎంచుకుని తనదైన శైలిలో నటించి స్టార్ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సమంత తన సొంత భాష తమిళంలో మాత్రం ఐరన్ లెగ్ అనే ముద్ర పడేలా చేసుకుంది. అమ్మడు చేసిన సినిమాలన్ని తమిళంలో బోల్తా పడడంతో ఈ ముద్రను చెరిపేసుకోలేక పోయింది. క్రేజీ కాంబోల్లో సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను అలరించలేదు. ఏకంగా తమిళ సినిమాల కోసం టూ పీస్ బికినీ వేసినా లాభం లేకుండా పోయింది. 
 
అయితే అమ్మడు విక్రంతో నటించిన '10 ఎన్రదుకుల్ల' సినిమా ఫ్లాప్‌ని మాత్రం అమ్మడు జీర్ణించుకోలేకపోయింది. భారీ అంచనాలతో వెలువడిన  '10 ఎన్రదుకుల్ల' కోలీవుడ్‌లో పరాజయం పొందింది. తరువాత ధనుష్ హీరోగా వచ్చిన 'తంగమగన్' పరాజయంతో కోలీవుడ్ అంతా సమంతను ఐరన్ లెగ్ అనేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితుల ప్రభావం చూస్తే అది నిజమేనా అనిపిస్తుంది. రీ సెంట్‌గా రిలీజ్‌ అయిన 'బెంగళూర్‌ నాట్కాల్‌' కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి సమయంలో తనకి 'కత్తి'తో తొలి హిట్ ఇచ్చిన విజయ్, తన 'తెరి' సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకున్నాడు.
 
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం', త్రివిక్రమ్ దర్శకత్వం లో 'అ..ఆ' తమిళ్ లో సూర్య సరసన '24' చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రాలు బాక్స్ ఆఫీసు దగ్గర అటు ఇటుగా ఆడితే సమంతకు ఐరన్ లెగ్ అని ముద్ర పాడడం ఖాయమని సినీ ప్రముఖులు అంటున్నారు. ఈ సినిమాల ద్వారా సమంత ఐరన్ లెగ్ అవుతుందా లేక గోల్డెన్ లెగ్ అవుతుందో.. వేచి చూడాల్సిందే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments