Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ కెరీర్‌పై సీరియస్‌గా ఉన్న సమంత.. శ్రుతిహాసన్.. చైతూ కెమెస్ట్రీపై ఆరా..

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ''ప్రేమమ్'' సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళంలో ఘన విజయం సాధించిన ''ప్రేమమ్‌''కు రీమేక్ అయిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (17:05 IST)
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ''ప్రేమమ్'' సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళంలో ఘన విజయం సాధించిన ''ప్రేమమ్‌''కు రీమేక్ అయిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇక నాగ చైతన్య కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా ప్రేమమ్ నిలుస్తుందన్న ప్రచారం మొదట్నుంచీ వినిపిస్తూ ఉండడంతో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది. 
 
అదేవిధంగా ఇప్పుడు సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రుతిని చూసి స‌మంత తెగ టెన్ష‌న్ ప‌డిపోతోందట. స‌మంత కూడా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌… శ్రుతి త‌న‌కు పోటీ ఇస్తుంద‌నో, త‌న6 స్థానాన్ని త‌న్నుకుపోతుంద‌నో కాదు... ప్రేమ‌మ్ సినిమాలో శ్రుతి పాత్ర గురించే తెగ ఫీలైపోతోందట స‌మంత. 
 
చైతూ ఇప్ప‌టివ‌కు చాలామంది హీరోయిన్ల‌తో న‌టించినా శ్రుతిహాస‌న్ లాంటి టాప్ హీరోయిన్‌తో ఎప్పుడు న‌టించ‌లేదు. ఈ సినిమాలో చైతూ ప‌క్క‌న మ‌ల‌యాళీ బ్యూటీస్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోనాలు న‌టించినా అంద‌రి దృష్టి మాత్రం చైతూ శ్రుతీలపైనే ఉంది. సినిమాలో వీళ్లిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ కెమిస్ట్రీ బాగా పండిందట. 
 
ఈ విష‌యం స‌మంత వ‌ర‌కు వెళ్ల‌డంతో ఆమెకు కూడా ఆస‌క్తి పెరిగిందట‌. చైతూ శ్రుతీల కాంబినేష‌న్‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాల‌ని స‌మంత త‌హ‌త‌హ‌లాడుతోందట. ఈ విష‌యాల‌ను ముందుగానే దృష్టిలో పెట్టుకున్న స‌మంత ఈ సినిమాలో చైతు, శ్రుతీల మ‌ధ్య నార్వేలో రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు త‌ను కూడా నార్వేకి వెళ్లి సాంగ్ విష‌యంలో కొన్ని సూచ‌న‌లు చేసింద‌ట. దీన్నిబ‌ట్టి చూస్తే చైతూ కెరీర్‌పై స‌మంత ఎంత సీరియ‌స్‌గా దృష్టి పెట్టిందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కాబట్టి వీరిద్దరి విష‌యంలో స‌మంత ఇలా టెన్ష‌న్ ప‌డింద‌ని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments