Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ నువ్వూ విప్పేస్తావా? సల్మాన్ సవాల్, విప్పేసిన చరణ్... షాకయిన సల్లూ... సానియా పార్టీలో...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖానే షాక్ తిన్న వేళ. కండల వీరుడు అంటే సల్మాన్ ఖాన్ నే అందరూ చెప్పుకుంటారు. అలాంటిది తన కండలకు మించిన కండల వీరుడుని చూసి సల్మాన్ ఖాన్ షాకయ్యాడట. ఇంతకీ ఎవరా కండల వీరుడు... ఏమిటా సంగతి అనేది తెలుసుకోవాలంటే కొద్దిగా లోపలికి వె

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (13:38 IST)
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖానే షాక్ తిన్న వేళ. కండల వీరుడు అంటే సల్మాన్ ఖాన్ నే అందరూ చెప్పుకుంటారు. అలాంటిది తన కండలకు మించిన కండల వీరుడుని చూసి సల్మాన్ ఖాన్ షాకయ్యాడట. ఇంతకీ ఎవరా కండల వీరుడు... ఏమిటా సంగతి అనేది తెలుసుకోవాలంటే కొద్దిగా లోపలికి వెళ్లాల్సిందే.
 
భారత్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సోదరి పెళ్లి వేడుకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యాడట. ఇంకా ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వచ్చారట. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రామ్ చరణ్ తేజ, తన సతీమణి ఉపాసనతో కలిసి పెళ్లికి హాజరయ్యారట. పెళ్లి వేడుక అంటే చిందేయడం మామూలే కదా. ఐతే ఈమధ్య సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రంలో సిక్స్ ప్యాక్ చూపించి అందరినీ ప్లాట్ చేసేశాడు. 
 
ఇంకా ఆ బాడీ మెయింటైన్ చేస్తున్నాడేమో... పార్టీలో డ్యాన్స్ చేస్తూ చొక్కా విప్పేసి సిక్స్ ప్యాక్ చూపించేశాడట. సిక్స్ ప్యాక్ పైన బాగానే ఉన్నా కింద కాస్త బాన పొట్టగా కనబడిందట. పొట్టపైన ప్యాకులు లేవట. ఐతే దాన్ని గంభీరంగా అందరికీ చూపిస్తూ తెగ పోజులు కొట్టేశాడట. అక్కడే ఉన్న చెర్రీని చూస్తూ... ఏంటి మగధీరా... నువ్వు కూడా విప్పుతావా అని సైగ చేశాడట. సల్లూ అలా అడిగేసరికి పక్కనే ఉన్నవారు చెర్రీని స్టేజిపైకి తోశారట. చెర్రీ తన చొక్కా విప్పి పక్కకు పడేసి అలా చూపించేసరికి సల్మాన్ షాక్ తిన్నాడట. 
 
ఎందుకంటే చెర్రీ పొట్ట మీద కూడా ప్యాకులు చూపించాడట. దానితో బాబోయ్... నేను తట్టుకోలేను. ఏంటా ప్యాకులు... నన్ను మించినవారు లేరనుకున్నా... చెర్రీ యు ఆర్ ది గ్రేట్ అనేశాడట సల్మాన్. చెర్రీ ఈమధ్య ధృవ సినిమా కోసం బాడీని సిక్స్ ప్యాకుతో చాకులా తయారుచేశాడట. మొత్తానికి సానియా మీర్జా సోదరి పెళ్లి వేడుకలో ఇలాంటి సరదాలు చాలా జరిగాయట. వీటిపై బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments