సీతారాములుగా సాయిపల్లవి- రణబీర్ కపూర్- రావణుడిగా కేజీఎఫ్ హీరో?

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (12:08 IST)
Saipallavi
అందాల తార సాయి పల్లవి, రణబీర్ కపూర్ "రామాయణం"లో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. సీత దేవి పాత్రలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తుండగా, కెజిఎఫ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. 
 
2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ శ్రీరాముడిగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. 
 
అయితే ఇప్పుడు సాయి పల్లవి, బ్రహ్మాస్త్ర నటుడు రణబీర్ కపూర్ రామాయణంలో సీతారాములుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. 
 
ప్రముఖ సినీ నిర్మాత మధు మంతెన రామాయణాన్ని 3 భాగాల సినిమాగా తీయడం గురించి పెద్ద ప్రణాళికలను పంచుకున్నారని, నితీష్ తివారీ దర్శకుడిగా మారారని బిటౌన్ టాక్. ఈ రాబోయే ప్రాజెక్ట్ రామాయణం ద్వారా సాయి పల్లవి బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తుంది.
 
టాలీవుడ్‌లో, సాయి పల్లవి చివరిసారిగా లేడీ ఓరియెంటెడ్ మూవీ గార్గిలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఉంది. అలాగే NC23లో తన షూటింగ్‌‌ను ప్రారంభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments