Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవికి ఆ హీరో ప్రపోజ్ చేస్తే చెప్పు చూపించిందట...

'ఫిదా' చిత్రంలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి. ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్. ఈ చిత్రం షూటింగ్ సమయంలో సాయిపల్లవిపై మనసుపడిన వరుణ్... ఆమెను ప్రపోజ్ చేశాడట. దీనిపై తీవ్రంగా స్పందించిన సాయిపల్లవి కాలి చెప్పు తీస

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (16:53 IST)
'ఫిదా' చిత్రంలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి. ఈ చిత్ర హీరో వరుణ్ తేజ్. ఈ చిత్రం షూటింగ్ సమయంలో సాయిపల్లవిపై మనసుపడిన వరుణ్... ఆమెను ప్రపోజ్ చేశాడట. దీనిపై తీవ్రంగా స్పందించిన సాయిపల్లవి కాలి చెప్పు తీసి చూపించిందట. దీంతో హీరో వరుణ్ తీవ్రంగా హర్టయ్యాడట.
 
ఫిదాలోని వరుణ్‌లాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో ఉంటారా? అని భానుమతి ఉరఫ్ సాయిపల్లవి తెలిపింది. ఈ సినిమా చూసిన తరువాత అలాంటి అబ్బాయి ఉంటాడా? అని ఆలోచించానని చెప్పింది. 
 
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ వరుణ్ లాంటి అబ్బాయి ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా రిజెక్ట్ చేయదన్నారు. ఒక వేళ రిజెక్ట్ చేసినా చెప్పుమాత్రం చూపించదని చెప్పింది. అలాగే, తనకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే తాను చెప్పు చూపించనని చెప్పింది.
 
ఆ తర్వాత హీరో వరుణ్ మాట్లాడుతూ ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే చెప్పు చూపించిందని, దానిని తాను చాలా హర్టయ్యానని చెప్పాడు. దీంతో సాయిపల్లవి అయ్యో అప్పుడలా అనలేదు... అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. దీంతో వరుణ్ తేజ్ కాసేపు సాయిపల్లవిని ఆటపట్టించాడు. 
 
దీంతో దిల్ రాజు కల్పించుకుని... అయినా సాయిపల్లవి అలా ఎవరైనా అబ్బాయికి చెప్పు చూపించడం తప్పు అనడంతో... అయ్యో నేను చూపించలేదు సర్... భానుమతి కేరక్టర్ చూపించింది. అయినా ట్రైన్‌లో అవన్నీ విన్న తర్వాత ఏ అమ్మాయి అయినా అలాగే చెబుతుంది అని చెప్పింది. ఆమెకు దర్శకుడు శేఖర్ కుమ్ముల అండగా నిలిచారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments