Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోకు మాత్రమే సాయిపల్లవి లిప్ లాక్.. ఇంకెవ్వరికీ ఇవ్వలేదట..

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:49 IST)
Saipallavi
ఫిదా భామ సాయిపల్లవి రీల్ లైఫ్‌లోనూ రియల్ లైఫ్‌లోనూ ఒకేలా వుంటుంది. ఎంత డబ్బిచ్చినా ఎక్స్‌పోజింగ్ చేసేది లేదని మొఖాన్నే చెప్పేస్తుంది. ఆమెకంటూ కొన్ని నియమాలు, పద్ధతులున్నాయి. వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తుంది. పరిమితులు దాటే పరిస్థితి వస్తే సినిమా చేయనంటారు. అది ప్రేయసి పాత్రైనా చెల్లి పాత్రైనా సినిమాలో ప్రాధాన్యత ఉండాలి. 
 
చిరంజీవి లాంటి స్టార్‌కి నిర్ధాక్షిణ్యంగా చేయనని చెప్పేసే అంత ధైర్యం ఆమె సొంతం. అలాగే సాయి పల్లవి స్కిన్ షో చేయదు. అవసరం లేని మేకప్ వేసుకోదు. కెరీర్‌లో సాయి పల్లవి ఒక్క సినిమాలో కూడా పొట్టి బట్టలు వేసుకుంది లేదు. శృంగార సన్నివేశాల్లో నటించలేదు.
 
అయితే ఓ హీరోకి ఆమె లిప్ కిస్ పెట్టారు. తన పద్ధతులు, నిబంధనలు ఆ హీరో కోసం పక్కన పెట్టారు. ఆ హీరో ఎవరో కాదు నాగ చైతన్య. లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్యను రెండు సార్లు కిస్ చేస్తుంది. లోకల్ ట్రైన్ లో పబ్లిక్‌గా అతని బుగ్గపై ముద్దు పెడుతుంది. రెండో సన్నివేశంలో పడుకున్న నాగ చైతన్య పెదాలపై ముద్దు పెడుతుంది. నిజంగా ఇది షాకిచ్చే విషయమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
సాయి పల్లవి చాలా మంది హీరోలతో నటించారు కానీ ఎవరితో లిప్ లాక్ సన్నివేశం చేయలేదు. నాగ చైతన్యతో కూడా మరీ ఘాటుగా ఆ సన్నివేశం ఉండదు. అయితే సాయిపల్లవి అది చేయడమే చాలా ఎక్కువ. ఆమె ఈ సీన్ చేయడానికి ఒప్పుకోవడం వెనుక దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా కారణం కావచ్చునని టాక్ వస్తోంది.  ఈ సినిమా విడుదలై కొంత కాలం గడుస్తున్నా.. ప్రస్తుతం ఫిదా భామ లిప్ లాక్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments