Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు "గల్లీబాయ్"గా మారాలనుకుంటున్న యంగ్ హీరో

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:19 IST)
బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా విడుదలైన తాజా చిత్రం ' గల్లీబాయ్' హిట్ టాక్‌ను స్వంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు హీరో, హీరోయిన్‌తో సహా చిత్ర యూనిట్ మొత్తం వివిధ తరహా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. 
 
కానీ సెన్సార్ సమయంలో ఎన్నో కీలకమైన సన్నివేశాలకు కత్తెర పడ్డప్పుడు, దీని ప్రభావం సినిమాపై ఉంటుందని కొందరు భావించినా మంచి విజయాన్ని సాధించి చూపించింది ఈ సినిమా. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమర్శకులు మరియు సినీ పాత్రికేయుల ప్రశంసలను కూడా అందుకుంది.
 
చాలామంది యాక్టర్‌లు ఇప్పటికే ఈ సినిమా చూసి, ప్రశంసించడం జరిగింది. స్లమ్ ఏరియాలో ఉండి, కష్టపడి ర్యాపర్‌గా మారిన యువకుడి బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడయ్యాడట. ప్రస్తుతం 'చిత్రలహరి' అనే సినిమాతో బిజీగా ఉన్న తేజ్, ఈ పనులు పూర్తి చేసుకున్న వెంటనే 'గల్లీబాయ్' రీమేక్ మీద కసరత్తు చేయాలని భావిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments