Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనా, సాయిధరమ్ తేజ్‌లు అలా డిసైడయ్యారట.. నెక్ట్స్ 3 సినిమాలు చేయరట!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (11:43 IST)
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోయిన్ రెజీనా ప్రేమ పక్షుల్లా విహరించిన సంగతి తెలిసిందే. 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంలో కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, వీళ్ల రెండో సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' షూటింగ్ సమయంలో ఇద్దరూ బాగా దగ్గరయ్యారని, అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన రెజీనా మా ఇద్దరి మధ్య ఏమీ లేదని తేల్చిచెప్పేసింది.
 
ఏమీ లేకపోతే సాయి ధరమ్ తను నటిస్తున్న సినిమా కోసం రెజీనానే ప్రత్యేకంగా ఎందుకు హీరోయిన్‌గా తీసుకుంటున్నాడని సినీజనాలు తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సాయిధరమ్ తేజ్, రెజీనాకి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే... మరో మూడు సినిమాల వరకూ తామిద్దరూ కలిసి నటించకూడదని సాయిధరమ్ తేజ్, రెజీనా డిసైడ్ అయ్యారట.
 
ఇలా చేయడం వల్ల కొన్నాళ్ల పాటు తమ ప్రేమ వ్యవహారం గురించి సినీజనాలు చర్చించుకోకుండా ఉంటారని ఈ ప్రేమ పావురాలు భావిస్తున్నారట. అలాగే రెజీనాకి కాస్త దూరంగా ఉండమని ఇంటి నుంచి కూడా సాయిధరమ్ తేజ్‌కి కూడా మెగా ఫ్యామిలీ నుండి అందాయని వార్తలు వెలువడుతున్నాయి. అందుకే కొన్నాళ్లపాటు సాయిధరమ్ తేజ్, రెజీనా దూరంగా ఉండబోతున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మోటారు వాహన చట్టం- ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

GV Reddy: బడ్జెట్ అదుర్స్.. 2029లో మళ్ళీ బాబు ముఖ్యమంత్రి కావాలి: జీవీ రెడ్డి

Vijay as Pawan: పవన్‌లా వుండిపో.. పీకే సూచన.. పళని సీఎం అయితే విజయ్‌ డిప్యూటీ సీఎం?

బైకుకు ముందొకరు, వెనుకొకరు.. మందేసి బైకుపై నిల్చుని.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ యువతి హంగామా.. (video)

Trump-Zelenskyy: డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య వాగ్వాదం.. తలపట్టుకున్న ఒక్సానా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments