Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐష్ పెట్టిన ఉంగరం లేకుండా కనిపించిన అభిషేక్, విడాకులు అంటూ గొడవ

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (23:04 IST)
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికి ఎన్నోమార్లు చర్చల్లో నిలిచింది. మళ్లీ ఐష్, అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి మాట్లాడుతున్నారు. ఇదిలావుండగా ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది, అందులో తను- అభిషేక్ ప్రతిరోజూ గొడవపడేవారని ఆమె వెల్లడించింది. అయితే అభిషేక్ కూడా స్పందించాడు.
 
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాలీవుడ్ ప్రియమైన జంటలలో ఒకటి. వీరికి వివాహమై 16 ఏళ్లు దాటింది. కుమార్తె ఆరాధ్య బచ్చన్‌కు తల్లిదండ్రులు. ఈ జంట తమ వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే తాజాగా అభిషేక్ పెళ్లి ఉంగరం లేకుండా కనిపించడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇంతకుముందు ఒక పాత ఇంటర్వ్యూలో, తన వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తనకు- అభిషేక్‌కు రోజూ గొడవలు జరుగుతున్నాయని వెల్లడించింది.
 
పాత 2010లో 'వోగ్ ఇండియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఐశ్వర్య రాయ్ బచ్చన్- అభిషేక్ బచ్చన్ 'ప్రతిరోజూ' గొడవలు పడుతున్నట్లు ఒప్పుకున్నారు. ఐశ్వర్య 'వివాదం' అని చెప్పగా, అభిషేక్ ఆ గొడవను 'అసమ్మతి'గా అభివర్ణించారు. దీనికి సంబంధించి ఐశ్వర్య మాట్లాడుతూ, 'రోజూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత అభిషేక్ వేగంగా మాట్లాడి.. ఇది గొడవ కాదని, ఏదో ఒక విషయంలో అసమ్మతి అని స్పష్టం చేశాడు.భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగాదాలు లేకపోతే జీవితం పూర్తిగా బోరింగ్ అవుతుంది. కనుక అలాంటివి మామూలే అని అభిషేక్ అన్నారు. ఐతే ఇప్పుడు మరోసారి ఐష్-అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారంటూ చర్చ నడుస్తోంది. ఇందులో నిజం ఎంత వున్నదో తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

చనిపోయాడనుకున్న వ్యక్తిని ఆ పచ్చబొట్టు ఆ వ్యక్తిని కాపాడింది.. నిరంజన్ రెడ్డి అలా కాపాడారు

ప్లీజ్.. ఎమ్మెల్యే పింఛన్ మంజూరు చేయండి : దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

TGSRTC: ఐటీ కారిడార్‌లో 275 ఎలక్ట్రిక్ బస్సులు

అత్యాచారం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు - కాల్పులు జరిపి పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments