Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్పైడర్‌'లో 8 మినిట్స్ ఫైట్ కోసం రూ.20 కోట్లు ఖర్చు

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రంలోని ఓ ఫైట్ కోసం ఏకంగా రూ.20 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ న్యూస్ ఇపుడు టాలీవుడ్, కోలీవుడ్ చిత్

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (09:53 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రంలోని ఓ ఫైట్ కోసం ఏకంగా రూ.20 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ న్యూస్ ఇపుడు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రపరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా, ఈ చిత్రంలో మహేష్ పోలీస్ గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో నిర్మితవుతోంది. ఇటీవలే మహేష్‌బాబు, ప్రతినాయకుడు ఎస్.జె.సూర్య మధ్య ఓ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. 8 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతున్నది. 
 
కథాగమనంలో కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ కీలక మలుపుగా ఉంటుందని తెలిసింది. 8 నిమిషాల సన్నివేశం కోసం దాదాపు ఇరవై కోట్ల భారీ వ్యయాన్ని చేశారని సమాచారం. గ్రాఫిక్స్ హంగులతో ఈ పోరాట ఘట్టాల్ని తీర్చిదిద్దారని తెలిసింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్ను ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఈ నెల 9న మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయనున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌జైరాజ్, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments