Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్య‌కు విల‌న్ రోజా... ఇది నిజ‌మేనా?

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (21:00 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం రూల‌ర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
 
అయితే... ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ లేడీ విల‌న్ పాత్ర ఉంద‌ట‌. ఈ పాత్ర‌ను రోజాతో చేయించాలి అనుకున్నార‌ట బోయ‌పాటి. రోజాని సంప్ర‌దిస్తే... క్యారెక్ట‌ర్ న‌చ్చి ఓకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాల‌య్య‌, రోజా క‌లిసి జంట‌గా బొబ్బిలి సింహం, భైర‌వ‌ద్వీపం, మాతో పెట్టుకోకు.. త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. 
 
ఇప్పుడు వీరిద్ద‌రు హీరో, విల‌న్ పాత్ర‌ల్లో న‌టించ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై చిత్ర యూనిట్ మాత్రం స్పందించ‌లేదు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ కూడా న‌టిస్తున్నాడ‌ని తెలిసింద‌. ఇవ‌న్నీ వాస్త‌వ‌మేనా..? కాదా..? అనేది క్లారిటీ రావాలంటే.. మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments