Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిచా గంగోపాధ్యాయ జాడ కనిపించట్లేదే..? ఏమైంది..? అమెరికాకు ఎందుకెళ్లిపోయింది?

లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రిచా గంగోపాధ్యాయ జాడ కనిపించట్లేదు. ప్రభాస్‌తో కొరటాల శివ తీసిన మిర్చి, మాస్ మహారాజ రవితేజ మిరపకాయ్ వంటి సినిమాలు రిచా గంగోపాధ్యాయ్‌కి సక్సెస్ ఇచ్చాయి. తెలుగులోనే కాకుం

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (13:11 IST)
లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రిచా గంగోపాధ్యాయ జాడ కనిపించట్లేదు. ప్రభాస్‌తో కొరటాల శివ తీసిన మిర్చి, మాస్ మహారాజ రవితేజ మిరపకాయ్ వంటి సినిమాలు రిచా గంగోపాధ్యాయ్‌కి సక్సెస్ ఇచ్చాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో ధనుష్, శింబు లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసింది.
 
కానీ హీరోయిన్‌గా ఆఫర్స్ వస్తున్నా కూడా వాటిని కాదనుకొని రిచా అమెరికా వెళ్ళిపోయింది. కింగ్ నాగార్జునతో చేసిన 'భాయ్' మూవీ రిచా లాస్ట్ మూవీ. అలా సిల్వర్ స్క్రీన్‌కి దూరమైన మిర్చి బ్యూటీ రిచా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా వుంటోంది. సినిమాలకు దూరంగా ఉన్న విషయంపై సోషల్ మీడియాలో రిచా గంగోపాధ్యాయ స్పందించింది. 
 
అసలు సినిమాలని తాను వృత్తిగా తీసుకోలేదని, క్యాజువల్‌గా ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యానని క్లారిటీ ఇచ్చింది. సినిమా అంటే సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టే హీరోయిన్‌గా ఆఫర్స్ వున్నా చేయకుండా అమెరికా వచ్చేసానని చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో మూవీ మేకింగ్ కోర్స్‌ చేస్తున్నానని.. మళ్ళీ హీరోయిన్‌గా చేయాలనే ఆసక్తి వస్తే తెలుగులోనే చేస్తానని చెబుతోంది. మరి అప్పటికీ రిచాకు హీరోయిన్ ఆఫర్లు వస్తాయో లేదో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments