Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాయర్‌కు రోజుకు రూ.10 లక్షల ఫీజు చెల్లిస్తున్న సుశాంత్ ప్రియురాలు

Webdunia
గురువారం, 30 జులై 2020 (19:44 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కుర్ర హీరోకు బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో పాటు.. అంకిత అనే ప్రేయసిలు ఉన్నారు. వీరిలో రియా చక్రవర్తి చేసిన మోసం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెతోపాటు.. మరో నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి వద్ద వివరాలు సేకరించేందుకు ముంబైకు చేరుకున్న పోలీసులకు... రియా కనిపించకుండా పోయింది. 
 
ఇదిలావుంటే, ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీహార్ పోలీసులు బాంద్రాలోని కోట‌క్ మ‌హీంద్ర బ్యాంక్‌కు వెళ్లి.. సుశాంత్ బ్యాంకు ఖాతా వివ‌రాలు సేకరించారు. ఇందులో సుశాంత్ చ‌నిపోయేకంటే ముందు అత‌ని అకౌంట్ నుంచి రూ.15 కోట్లు వివిధ ఖాతాల‌కు బ‌దిలీ అయిన‌ట్టు పోలీసులు గుర్తించారు.
 
మ‌రోవైపు రియా వ్య‌క్తిగ‌త బ్యాంకు లావాదేవీల‌పై కూడా ఆరా తీశారు. ఇదిలావుంటే రియా చ‌క్ర‌వ‌ర్తి త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సుశాంత్ ను దోపిడీ చేసి ప్రాణాలు పోయేలా చేశార‌ని.. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఇక్కడ మ‌రో ఆస‌క్తికర విష‌య‌మేంటంటే.. రియా ముంబైలో పేరు మోసిన లాయ‌ర్ స‌తీశ్ మాన్‌షిండే‌కు త‌న కేసు అప్ప‌గించింద‌ట‌. అంతేకాదు రియా ఆమె లాయ‌ర్ స‌తీశ్‌కు రోజుకు రూ.10 ల‌క్ష‌లు ఫీజు ఇస్తున్న‌ట్టు వార్త ఇపుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
 
అంతంత మాత్ర‌మే సినిమా అవ‌కాశాలున్న రియా చ‌క్ర‌వ‌ర్తి మ‌రి ఇంత పెద్ద మొత్తంలో లాయ‌ర్‌కు ఫీజు ఇస్తుందన‌డం.. పలు అనుమానాల‌కు తావిస్తోంది. రియా చ‌క్ర‌వ‌ర్తి గ‌త కొన్ని రోజులుగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జ‌రిపింది. 
 
రియా వెనుక అస‌లు ఎవ‌రెవ‌రున్నారు.. రియా ఒక్క‌రే ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దును వినియోగించిందా..? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి కేసు విచార‌ణ పూర్త‌యితే మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments