Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బో.. రెజీనా ఎంత రేటో!

వెండి తెరపై అందం అభినయంతో మైమరపించే ప్రముఖ నటీమణుల పారితోషికాల వివరాలను చూస్తే ఎవరికైనా దిమ్మదిరిగిపోవాల్సిందే. దీపం ఉండగా ఇళ్లు చక్కబెట్టుకోవాలి.. పుల్ ఫాంలో ఉన్నప్పుడే డబ్బులు వెనకేసుకోవాలి..ఇది దక్

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (13:29 IST)
వెండి తెరపై అందం అభినయంతో మైమరపించే ప్రముఖ నటీమణుల పారితోషికాల వివరాలను చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగిపోవాల్సిందే. దీపం ఉండగా ఇళ్లు చక్కబెట్టుకోవాలి.. పుల్ ఫాంలో ఉన్నప్పుడే డబ్బులు వెనకేసుకోవాలి..ఇది దక్షిణాది హీరోయిన్ల సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కొత్త హీరోయిన్లకే కాదు, పాత హీరోయిన్లకు వర్తిస్తుంది. ఒకప్పుడు అవకాశాల కోసం చిన్న చిన్న పారితోషికాలను తీసుకున్న హీరోయిన్లు రెండు, మూడు హిట్లు వచ్చాయంటే చాలు.. అమాంతం తమ రెమ్యునరేషన్‌ను పెంచేసుకుంటూ దర్శకనిర్మాతలకు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు.
 
కొత్త హీరోయిన్లు ఎందరూ వచ్చినా తమ స్థానాన్ని కాపాడుకుంటున్న నయనతార, త్రిష, అనుష్క, కాజల్, తమన్నా, సమంత, శృతిహాసన్ ఇలా ఈ భామలందరూ రెమ్యునరేషన్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లోనే ఉన్నారు. అయితే ఈ అగ్రహీరోయిన్ల జాబితాలో కుర్ర హీరోయిన్ రెజీనా కూడా చేరిపోయింది. ప్రస్తుతం రెజీనా ''జ్యో అచ్యుతానంద'', ''మా నగరం'' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాలేకాకుండా మరో చిత్రానికి కూడా ఆమె సంతకం చేసింది. అయితే ఈ చిత్రానికి పారితోషికం మాత్రం భారీగానే తీసుకుంటోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
ఇప్పటిదాకా రూ.60 లక్షలే తీసుకుంటున్న రెజీనా.. ఈ చిత్రానికి రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందట. దీనికి నిర్మాతలు సైతం ఒప్పుకున్నారని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటిదాకా చిన్న హీరోల సినిమాల్లోనే నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సారి ఓ టాప్ హీరోతో ఆడిపాడనుందట. పారితోషికం ఒకేసారి రూ.1.5 కోట్లు కావడంతో ఈ బ్యూటీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments