Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బోగన్'' దర్శకుడికి షాకిచ్చిన మాస్ మహారాజా: తలపట్టుకున్న లక్ష్మణ్?

మాస్ మహారాజా రవితేజ రీమేక్‌ల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 'రాజా ది గ్రేట్' చిత్రంతో హిట్ కొట్టిన రవితేజ.. ఆ చిత్రానికి ముందే ఒప్పేసుకున్న త‌మిళ చ

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (12:22 IST)
మాస్ మహారాజా రవితేజ రీమేక్‌ల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 'రాజా ది గ్రేట్' చిత్రంతో హిట్ కొట్టిన రవితేజ.. ఆ చిత్రానికి ముందే ఒప్పేసుకున్న త‌మిళ చిత్రం 'బోగ‌న్' రీమేక్‌లో న‌టించ‌బోన‌ని కరాఖండిగా చెప్పేసినట్లు సమాచారం. రవితేజ ఉన్నట్టుండి రీమేక్ సినిమాలను చేయబోమని చెప్పడంతో దర్శకుడు ల‌క్ష్మ‌ణ్ కంగు తిన్నాడట.
 
జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామిలు న‌టించిన 'బోగ‌న్' చిత్రానికి త‌మిళంలో కూడా లక్ష్మ‌ణే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా చేయ‌డానికి ర‌వితేజ ఒప్పుకోవ‌డంతో ఆయ‌న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఎనిమిది నెల‌లు క‌ష్ట‌ప‌డి స్క్రిప్ట్‌లో మార్పులు చేశాడట. 
 
అయితే రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. అదే స్క్రిప్ట్ ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడట. సినిమా స్క్రిప్ట్‌ను ర‌వితేజ ఎన‌ర్జీకి, తెలుగు ప్ర‌జ‌ల అభిరుచికి త‌గ్గ‌ట్లుగా మార్చాడట. ఈ చిత్రంలో ర‌వితేజ‌తో పాటు కేథ‌రీన్ త్రెసాను క‌థానాయిక‌గా తీసుకుందామని అనుకున్నారట. ఎస్‌జే సూర్యను అరవింద్ సామి రోల్‌కు తీసుకుందామనుకున్నట్లు తెలిసింది. అయితే రవితేజ నో చెప్పడంతో లక్ష్మణ్ తలపట్టుకున్నాడట. కాగా ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments