Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీ ఖన్నాకు ఇక మీదట కష్టమేనన్నమాట...

నేను నటిని. నా హద్దులు నాకుంటాయి. ఏ క్యారెక్టర్లో ఎలా చేయాలి. ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలి నాకు బాగా తెలుసు. నేను చిన్న పిల్లను కాను. అందులోను నేను చేసే క్యారెక్టర్లు యువకులకే కాదు మహిళలకు బాగా నచ్చాలి. కుటుంబం మొత్తం కూర్చుని చూసే సినిమాల్లోనే నటించా

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (21:50 IST)
నేను నటిని. నా హద్దులు నాకుంటాయి. ఏ క్యారెక్టర్లో ఎలా చేయాలి. ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలి నాకు బాగా తెలుసు. నేను చిన్న పిల్లను కాను. అందులోను నేను చేసే క్యారెక్టర్లు యువకులకే కాదు మహిళలకు బాగా నచ్చాలి. కుటుంబం మొత్తం కూర్చుని చూసే సినిమాల్లోనే నటించాలని ఎప్పుడూ అనుకుంటుంటాను. అలాంటి సినిమాలే చేస్తున్నాను కూడా. ఇప్పటివరకు హద్దులు దాటి నటించిన సన్నివేశాలంటూ ఏదీ లేదు. ఇక ఉండబోదు కూడా. ఒకవేళ అలాంటి సన్నివేశాల్లో నటిస్తే మాత్రం నన్ను నా కుటుంబ సభ్యులు చంపేస్తారు.. అని రాశీ ఖన్నా చెబుతోంది.
 
చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెరిగాను. సినిమాల్లో మొదట్లో వస్తానని అనుకోలేదు. అనుకోకుండా వచ్చేశాను. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చాలా తేడా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తే తప్ప ప్రేక్షకులు సినిమా థియేటర్ల వద్దకు రావడం లేదు. అందాలు ఆరబోయాలి.. తప్పు కాదు.. అయితే ఆరబోసే అందాలకు ఒక లిమిట్ ఉంటుంది. 
 
అందుకే నేనెప్పుడూ దర్శకుడికి ఒకటే చెబుతుంటాను. నా హద్దులు నాకుంటాయి. దాన్ని మించి సీన్లు చేయమని ఒత్తిడి చేయవద్దని ముందే దర్శకుడికి చెప్పేస్తానంటోంది రాశీ ఖన్నా. రాశీ నిర్ణయం బాగానే ఉన్నా ఇప్పుడు అందాలు ఆరబోయడానికి ఎంతోమంది నటీమణులు ఉన్నారు. అలాంటిది ఒక గీత గీసుకుని నటిస్తానంటున్న రాశీ ఖన్నాకు ఇక మీదట అవకాశాలు రావడం కష్టమేనన్నమాట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments