Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దు సీన్లు చాలా అర్థవంతంగా ఉన్నాయ్.. శృంగారానికి సంబంధించినవి కావు: నిహ్లానీ

ముద్దు సీన్లకు, అడల్ట్ సినిమాలకు సెన్సార్ కట్ ఇచ్చే సీబీఎఫ్‌సీ చైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లాని తాజాగా బేఫికర్ సినిమాకు యూ అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. సినిమాల్లో అశ్లీలత అంగీకరించని నిహ్లాన

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (13:15 IST)
ముద్దు సీన్లకు, అడల్ట్ సినిమాలకు సెన్సార్ కట్ ఇచ్చే సీబీఎఫ్‌సీ చైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లాని తాజాగా బేఫికర్ సినిమాకు యూ అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. సినిమాల్లో అశ్లీలత అంగీకరించని నిహ్లాని.. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన 'బేఫికర్‌' పట్ల నిహ్లానీ ఇంత ఉదారంగా ఉండేందుకు కారణం ఏమిటని జాతీయ మీడియా ప్రశ్నించడంతో.. స్పందించాడు.
 
ఏమన్నాడంటే.. గతంలో జేమ్స్‌బాండ్ సినిమా స్పెక్టర్‌లో ఓ ముద్దు సీన్‌కు బోలెడు కట్లు ఇచ్చిన నిహ్లాని... ఆపై పంజాబ్‌లోని విష సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన 'ఉడ్తాపంజాబ్‌'ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ సమయంలో సెన్సార్‌ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అలాంటిది ఇప్పుడు 23 ముద్దు సీన్లు ఉన్న 'బేఫికర్‌' సినిమాకు యూఅండ్ఎ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడంపై నిహ్లాని విచిత్రంగా సమాధానం ఇచ్చుకున్నారు. 
 
బేఫికర్‌లోని ముద్దు సీన్లు చాలా అర్థవంతంగా ఉన్నాయన్నారు. అవి శృంగారానికి సంబంధించిన ముద్దులు కావన్నారు. ప్రేమను వ్యక్తపరిచే ముద్దులైనా.. ఆ సినిమా భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు. కథ అంతా పారిస్‌లో జరుగుతుంద'ని తెలిపాడు. మరి నిహ్లానీ లాజిక్ కరెక్టయితే గతంలో జేమ్స్‌బాండ్‌లోని కిస్ సీన్‌కు ఎందుకు అన్ని కట్స్ చెప్పాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments