Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మొహంజోదారో’ చిత్రంపైనే హృతిక్ రోషన్ ఆశలు: 2016లో హిట్టేనా?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2016 (16:00 IST)
తనదైనా నటన.. కళ్లు చెదిరే డ్యాన్సుతో బాలీవుడ్‌ మైకెల్‌ జాక్సన్‌గా పేరుపొందిన నటుడు హృతిక్‌ రోషన్‌ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాక.. పూర్తిగా తన సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టాడు. తన ఇద్దరు కుమారుల్ని చూసుకుంటూ సినిమాలపై రాణించేందుకు సూపర్ హిట్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ  2014లో ‘బ్యాంగ్‌బ్యాంగ్‌’ సినిమా రిలీజ్‌కు తర్వాత 2015లో హృతిక్ ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.  
 
అయితే 2016 సంవత్సరంలో తన జోరును చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ కండలవీరుడు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘మొహంజోదారో’ కోసమే ఏడాదంతా కష్టపడ్డాడు. ఇటీవల 42వ సంవత్సరంలో అడుగుపెట్టిన హృతిక్‌ కొత్త సంవత్సరంలో స్పీడ్‌ పెంచుతున్నట్లు దానికి తగ్గట్టు వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. ‘ధూమ్‌ 3’ చిత్రానికి దర్శకుడైన విజయ్‌కృష్ణతో ఓ సినిమా ఒప్పుకున్నాడు. 
 
ఈ చిత్రం యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనుంది. పూర్తిస్థాయి యాక్షన్‌ అడ్వెంచర్‌గా సాగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం యేడాది మొదట్లోనే తెరకెక్కునుందని సినీ వర్గాల సమాచారం. అంతేకాదు.. తండ్రి రాకేష్‌ రోషన్‌ నిర్మాణ సారథ్యంలోనూ సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ పండితులు అంటున్నారు. రణ్‌వీర్ సింగ్, మాధవన్, హృతిక్ రోషన్ కాంబోలో రానున్న సినిమాకూ ఓకే చెప్పేశాడు. 
 
మొత్తానికి ఇచ్చిన మాట తప్పకుండా వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్న హృతిక్‌ ‘మొహంజోదారో’ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టాలని.. తద్వారా తన అభిమానులు పండగ చేసుకోవాలని హృతిక్ భావిస్తున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments