Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శృతిహాసన్...

తమిళ హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తక్కువ కాలంలోనే ఆ బ్రాండ్ నుంచి బయటపడింది. కమల్ హాసన్ కూతురిగానే కంటిన్యూ అయివుంటే… కమల్ కూతురు ఎక్స్‌పోజింగ్ చేయడమా? కమల్ కూతురు అల

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (13:02 IST)
తమిళ హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తక్కువ కాలంలోనే ఆ బ్రాండ్ నుంచి బయటపడింది. కమల్ హాసన్ కూతురిగానే కంటిన్యూ అయివుంటే… కమల్ కూతురు ఎక్స్‌పోజింగ్ చేయడమా? కమల్ కూతురు అలాంటి సినిమాలు చేయడమా? కమల్ హాసన్ కూతురి యాక్టింగ్ ఆయన స్థాయిలో లేదేంటి? వంటి విమర్శలు తరచుగా ఫేస్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. అందుకే ఆ బ్రాండ్‌ని వెంటనే వదిలించుకుంది. 
 
ఆ తర్వాత నుంచి ఎక్స్‌పోజింగ్ అయినా యాక్టింగ్ అయినా తనకు నచ్చిన పంథాలో చేసుకుంటూ పోతూ ఉంది. ఈ అమ్మడు కోలీవుడ్‌, టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌పైనే ఫోకస్‌ ఎక్కువగా పెట్టింది. తాజాగా ఈ భామ గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కత్రినా కైఫ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన బాలీవుడ్‌ లవర్‌బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో శృతి ప్రేమలో పడిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
వీరిద్దరూ ఇదివరకే ఓ యాడ్‌ఫిల్మ్‌ కోసం కలిసి పనిచేశారు. ఆ సమయం నుంచే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. అంతేకాదు రణ్‌బీర్‌ తాజా సినిమా ''యే దిల్‌ హై ముష్కిల్''’ షూటింగ్‌ స్పాట్‌కు కూడా శృతి పలుసార్లు వచ్చిందని, షూటింగ్‌ గ్యాప్‌లో వారు మాట్లాడుకుంటూనే ఉండేవారనీ బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ చాలాసార్లు చెట్టాపట్టాలేసుకుని నైట్‌ క్లబ్‌లకు, ముంబైలోని సబర్బన్‌ రెస్టారెంట్లకు వెళ్లారని సమాచారం. మరి ఏది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments