Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ జపం చేస్తున్న రానా... ఆటో వెనుక పవన్ ఫోటో

Webdunia
శనివారం, 19 జులై 2014 (12:54 IST)
ప‌వ‌న్‌... ప‌వ‌న్‌... ప‌వ‌న్‌.. ఈ పేరు ఒక‌ప్పుడు ఒక స్టార్ హీరో పేరు. ఆ త‌ర్వాత ఒక సంచ‌ల‌నం.. ఇప్పుడు సెంటిమెంట్‌గా మారింది. ఎందుకంటే.. ఫ్లాపుల్లో వున్న ప్రతి ఒక్కరికీ  ప‌వ‌న్ పేరు సంజీవిని అయింది. అలా ప‌వ‌న్ భ‌జ‌న‌తో ఫ్లాపుల బాట‌ నుండి బ‌య‌ట ప‌డి స‌క్సెస్‌ఫుల్‌గా కెరియ‌ర్‌ని న‌డిపిస్తున్న హీరో నితిన్‌. ప‌వ‌న్ ఆడియో రిలీజ్ చేస్తే చాలు సినిమా సూప‌ర్ హిట్ అనే టాక్ ఇష్క్ నుంచి ఆ సినిమా స‌క్సెస్ నుంచి విప‌రీతంగా స్ప్రెడ్ అయింది. దాంతో ఇక అంద‌రూ ప‌వ‌న్ భ‌జ‌నతో సినిమాకు క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చాలావ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.
 
నితిన్ నుంచి మొద‌లుపెట్టి మాస్ రాజా ర‌వితేజ కూడా బ‌లుపులో ప‌వ‌న్ ఇమేజ్‌ను వాడుకునే వ‌ర‌కు వ‌చ్చింది. ఇప్పుడీ లిస్ట్‌లో రానా కూడా చేరాడు. ఉన్నట్టుండి ప‌వ‌న్ భ‌జ‌న షురూ చేశాడు. ఎందుకిలా అంటే.. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌కు అన్ని వ‌ర్గాల్లోనూ విప‌రీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. నూటికి తొంభై ఆటోల వెనుక ప‌వ‌న్ పోస్టర్ వుంటుంది. అది చాలా కామ‌న్‌. అయితే, ఒక ఆటో వెనుక వున్న ప‌వ‌న్ పోస్టర్‌ను చూసిన రానా.. అది ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప‌వ‌న్ ఈజ్ గ్రేట్ అని గొప్పగా చెప్తున్నాడ‌ట‌. 
 
అంతేకాదు తోటి ఆర్టిస్టుల‌తోనూ ఈ విష‌యాన్ని గొప్పగా చెప్పడం విశేషం. ఇదంతా ఫ్లాపుల్లో వున్న రానా ప‌వ‌న్ పేరు వాడుకుని స‌క్సెస్ కొట్టే ప్రయత్నం అని కొంద‌రంటుంటే.. రానా ఎన్నోసార్లు ప‌వ‌న్ ఫ్యాన్‌ అని బాహాటంగానే చెప్పాడు.. త‌న అభిమాన హీరో గురించి గొప్పగా చెప్పడంలో త‌ప్పేముంది అని కొంద‌రంటున్నారు. ఏదేమైనా రానా ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌పోర్ట్ కూడ‌గ‌ట్టుకోవ‌టం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేష‌కులు, ఫిల్మ్ నగర్ జ‌నాలు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments