Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సైన్యం 2 మిలియన్లు.. అందరికీ ధన్యవాదాలు.. రానా ట్వీట్

హీరోగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత విలన్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ వైపు మొగ్గుచూపాడు దగ్గుబాటి రానా. ముందు ఇదేం నిర్ణయం అన్నవాళ్లంతా ఆ తర్వాత శభాష్‌ అంటున్నారు. ''బాహుబలి'' వంటి సినిమాతో రానా ఇమేజ్‌ ఎక్కడి

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:04 IST)
హీరోగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత విలన్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ వైపు మొగ్గుచూపాడు దగ్గుబాటి రానా. ముందు ఇదేం నిర్ణయం అన్నవాళ్లంతా ఆ తర్వాత శభాష్‌ అంటున్నారు. ''బాహుబలి'' వంటి సినిమాతో రానా ఇమేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు అతడికి హీరోగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. అతడితో సినిమాలు చేయడానికి ఇటు సౌత్‌ ఇండియా నుంచి.. అటు బాలీవుడ్‌ నుంచి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. 
 
దేశ విదేశాలకు చెందిన సినీ ప్రియులు రానాపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రానాని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ హీరో ఫాలోవర్స్ 2 మిలియన్స్‌కి చేరుకోగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. నా సైన్యం రెండు మిలియన్లు.. నాకు స్ట్రెంత్‌గా నిలిచిన అందరికి ధన్యవాదాలు అని రానా తెలిపాడు. 
 
ప్రస్తుతం ఈ హీరో 1945 అనే తమిళ సినిమాతో పాటు, తేజ సినిమాలో నటించనున్నాడు. 1945 చిత్రంలో రెజీనా లీడ్ రోల్‌లో నటిస్తుండగా... సత్యరాజ్ మరో ప్రధాన పాత్రలో చేస్తున్నాడు. సత్యశివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో.. దగ్గుబాటి రానా చేయనున్న రోల్.. అతని కెరీర్‌లోనే స్పెషల్ కానుందట. ఈ పాత్రకు షూటింగ్ పూర్తి చేయగానే.. తేజ డైరెక్షన్‌లో ఇంకో సినిమాను చేయడానికి రానా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments