Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ టీవీ యాంకర్‌పై రానా ఫైర్.. ఓ పబ్లిసిటీ స్టంటా.... (Video)

ప్రముఖ టీవీ మహిళా యాంకర్‌పై టాలీవుడ్ హీరో రానా పబ్లిక్‌గా వార్నింగ్ ఇవ్వడం ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే ఆ యాంకర్‌పై రానా మండిపడ్డారనే ప్రచారం జోరుగా స

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (13:17 IST)
ప్రముఖ టీవీ మహిళా యాంకర్‌పై టాలీవుడ్ హీరో రానా పబ్లిక్‌గా వార్నింగ్ ఇవ్వడం ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే ఆ యాంకర్‌పై రానా మండిపడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
హీరో రానా న‌టించిన "నేనే రాజు నేనే మంత్రి" చిత్రం గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో కొద్ది రోజులుగా త‌న‌ సినిమాని భారీగా ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు రానా. రీసెంట్‌గా ఓ చానెల్‌కి ఇంట‌ర్వ్యూ కోసం వెళ్ళాడు. అప్పుడు యాంక‌ర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కి వేలెత్తి చూపిస్తూ, పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు అడ‌గ‌కు అంటూ ఫైరయ్యాడు. దీంతో యాంక‌ర్ బిత్త‌ర పోయింది. 
 
అయితే ఈ వీడియో కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. నెటిజ‌న్స్ కూడా రానా కోపానికి కార‌ణం ఏంటో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని త‌న‌ ట్విట్ట‌ర్ ద్వారా రానాని.. సారు మీరు నిజంగా ఛానెల్ యాంక‌ర్ పై సీరియ‌స్ అయ్యారా, లేదంటే ఇది ప‌బ్లిసిటీ స్టంటా అని అడిగాడు. 
 
దీనికి రానా.. ప్రోమో క‌ట్ కోసం యాంకర్ అలా చేయాల‌ని అడిగింది, అందుకే అలా అరిసాను అని రిప్లై ఇచ్చాడు. దీంతో కొద్ది రోజులుగా అభిమానుల‌లో నెల‌కొన్న సందేహం ప‌టాపంచలు అయింది. అంటే ఇదో రకం పబ్లిసిటీ అన్నమాట. పైగా, ఈ వీడియోను ఇప్పటివరకు 14 లక్షల మందికి పైగా వీక్షించడం గమనార్హం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments