Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వర్సెస్ పాకిస్తాన్... మొదటి సబ్‌మెరైన్ యుద్ధకథా చిత్రం... హీరోగా 'బాహుబలి' రానా

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (15:57 IST)
బాహుబలి చిత్రంతో మంచి ఇమేజ్ సాధించేసిన దగ్గుబాటి రానా మరో భారీ చిత్రానికి అంగీకరించినట్లు టాలీవుడ్ న్యూస్. 1971లో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ మోహరించిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘజి సముద్రంలో మునిగిపోయింది. ఐతే ఇది ఎలా మునిగిపోయిందన్నది ఇప్పటికీ మిస్టరీయే. 
 
కాగా ఆ సమయంలో ఇండియా నుంచి యుద్ధానికి వెళ్లిన ఎస్21 సబ్ మెరైన్ నేవల్ ఆఫీసర్, తన బృందంతో 18 రోజుల పాటు సముద్ర గర్భంలోనే యుద్ధం చేశారు. ఈ సంఘటన ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా బాహుబలిలో ప్రతినాయకుడిగా కనిపించి ప్రశంసలు అందుకున్న దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర కథను రానాకు చెప్పగానే ఓకే చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని పీవిపి సినిమా భారీ బడ్జెట్టుతో తీయబోతున్నట్లు తెలుస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments