Webdunia - Bharat's app for daily news and videos

Install App

భల్లాలదేవుడి భార్య ఎవరు? రానా ఆమేనంటూ ట్వీట్ చేశాడు.. నేనే రాజు నేనే మంత్రిపై ట్వీట్ల జల్లు

బాహుబలి భల్లాలదేవుడు.. రానాకు ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. హీరో రానా నటిస్తున్న కొత్త చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజ‌ర్‌ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. రానా ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (15:45 IST)
బాహుబలి భల్లాలదేవుడు.. రానాకు ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. హీరో రానా నటిస్తున్న కొత్త చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజ‌ర్‌ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. రానా ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్న ఈ టీజ‌ర్ ఆ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది. ఇందులో రానా లుక్‌ అదిరిందని.. బాహుబలి కాలభైరవుడు ప్రశంసలు పోస్టు చేశాడు. ఇందుకు రానా థ్యాంక్స్ అంటూ రీ ట్వీట్ చేశాడు. 
 
'నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా.. అలాగే నువ్వు ఎప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా' అంటూ రానా చెప్పిన డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఈ టీజ‌ర్‌పై స్పందించిన హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్.. ‘నీ జీవితానికి నిజంగా నువ్వే రాజు.. నువ్వే మంత్రివి’ అని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో రానాని ఉద్దేశించి పేర్కొంది. ఈ టీజ‌ర్ అద్భుతంగా ఉంద‌ని చెప్పింది. 
 
మరోవైపు.. 'బాహుబలి 2' చిత్రం విడుదలైన తర్వాత భల్లాలదేవుడి భార్య ఎవరు? తనకొడుకైన భద్రకు ఎవరి ద్వారా జన్మనిచ్చాడు? అనే ప్రశ్నలు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ప్రశ్నకు రానా కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. భద్ర సరోగసీ విధానంలో పుట్టాడంటూ సరదాగా బదులిచ్చాడు.
 
తాజాగా రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి' టీజర్‌ విడుదలైన సందర్భంగా ఓ అభిమాని రానా ఇదే ప్రశ్నను రిపీట్ చేశారు. ‘బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరు? మీరు ఈ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే' అని రానాకు ట్వీట్‌ చేశాడు. దీనికి రానా.. కాజల్‌ అంటూ సమాధానమిచ్చారు. ఈ ట్వీట్‌కి కాజల్ అగర్వాల్ కూడా రీ ట్వీట్ చేసింది. 
 
ఇక నేను ఏ సమాధానం చెప్పేది.. తమది జన్మ జన్మల అనుబంధం అంటూ కామెంట్ చేసింది. కాగా నేనే రాజా నేనే మంత్రి సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్‌లో రానా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments