Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ పవర్ స్టార్, అది చూడాలంటే డబ్బులు కట్టాల్సిందేనట

Webdunia
బుధవారం, 15 జులై 2020 (17:00 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. కరోనా అంటూ అందరూ షూటింగ్‌లు ఆపేసి ఇంట్లో కూర్చుంటే... వర్మ మాత్రం లాక్ డౌన్ టైమ్‌లో కూడా షూటింగ్‌లు చేస్తూ... డబ్బులు సంపాదిస్తున్నాడు. దటీజ్ వర్మ అనిపిస్తున్నాడు.
 
క్లైమాక్స్, నగ్నం, మర్డర్ ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పైన సినిమా తీస్తున్నాడు. అడిగితే మాత్రం ఇది పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సినిమా కాదు అని చెబుతున్నాడు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమా కోసం కొత్త ఆలోచనతో వస్తున్నాడు. ఏంటంటే.. పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే అంటున్నాడు.
 
ఇప్పటివరకు అన్ని సినిమాల ట్రైలర్‌ను ఫ్రీగానే చూపించారు కానీ.. వర్మ పవర్ స్టార్ ట్రైలర్‌కి కూడా కొంత అమౌంట్ పెట్టాలని ఆలోచిస్తున్నాడని తెలిసింది. ట్రైలర్ ద్వారా ఓ 5 లక్షలు వచ్చినా సినిమా బడ్జెట్ వచ్చినట్టు అవుతుంది. ఆ తర్వాత సినిమా ద్వారా ఎలాగూ ఇంకొంత అమౌంట్ వస్తుంది అనేది వర్మ ఆలోచన.
 
ఈ విషయం తెలిసి వర్మ మామూలోడు కాదు అంటున్నారు. వర్మ కొత్త ఆలోచన బాగానే ఉంది. దీనికి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరి... వర్మ కొత్త ఆలోచన వర్కవుట్ అవుతుందా..? ఆశించిన స్ధాయిలో స్పందన వస్తుందా..? రాదా..? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం