Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి హీరోయిన్ దొరకట్లేదట.. బాబాయ్ హీరోయిన్‌నే ఖరారు చేస్తాడా? చెర్రీ సరసన కీర్తీ?

ధృవ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో తదుపరి సినిమాపై రామ్ చరణ్ దృష్టి పెట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. అయితే

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:46 IST)
ధృవ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో తదుపరి సినిమాపై రామ్ చరణ్ దృష్టి పెట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. అయితే ఈ సినిమాకు ఓ చిక్కొచ్చి పడింది. అదేంటంటే హీరోయిన్ దొరక్కపోవడమే. ధృవ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌తో రొమాన్స్ చేసిన చెర్రీ.. కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాడు. బ్రూస్ లీ, ధృవలో ఒకే హీరోయిన్‌తో చేసి బోర్ కొట్టేయడంతో కొత్త హీరోయిన్ వేటలో చెర్రీ వున్నట్లు తెలుస్తోంది. 
 
దీంతో చరణ్-సుకుమార్ ల కాంబినేషన్‌‌‌లో రాబోయే సినిమాకు హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉండే హారోయిన్‌ కోసం వెతుకున్నాడు సుకుమార్. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు కొందరి హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. రాశిఖన్నా, కీర్తి సురేష్, సమంత.. ఇలా అందరి పేర్లు ఈ సినిమా కోసం వినిపించాయి. 
 
కీర్తి సురేష్‌ను ఖరారు చేద్దామని సుకుమార్ అనుకుంటున్నా.. ఇప్పటికే చెర్రీ బాబాయ్ పవన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. మహేష్ బాబు కూడా ఓకే చేసేందుకు లైన్లో ఉండటంతో.. డేట్స్ ప్రాబ్లమ్ వస్తుందని సుకుమార్ కామ్‌గా ఉన్నాడు. దీంతో సుకుమార్ ఆడిషన్స్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి చెర్రీ సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు కొట్టేస్తారో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments