Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలికి గోల్డెన్ ఆఫర్.. మలయాళ ఇండస్ట్రీ తలుపు తట్టింది.. మమ్ముట్టితో రొమాన్స్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయనుకున్న అంజలికి చుక్కెదురైంది. అవకాశాల్లేక ఖాళీగా ఉన్న అంజలికి జాక్ పాట్ తగిలింది. గత ఏడాది 'బాలకృష్ణ'కి జోడిగా నటించిన 'డిక్టేటర్'తో

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (14:39 IST)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయనుకున్న అంజలికి చుక్కెదురైంది. అవకాశాల్లేక ఖాళీగా ఉన్న అంజలికి జాక్ పాట్ తగిలింది. గత ఏడాది 'బాలకృష్ణ'కి జోడిగా నటించిన 'డిక్టేటర్'తో పాటు 'సరైనోడు' సినిమాలో 'బన్నీ'తో బ్లాక్ బస్టర్ సాంగ్‌లో అలరించింది. 
 
ఈ రెండు సినిమాల తరువాత 'అంజలి'కి తెలుగులో మరో అవకాశం రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ చెన్నైకి చెక్కేసింది. కానీ అక్కడ కూడా అంతంత మాత్రంగా వస్తున్న అవకాశాలతో కెరీర్‌ని లాగిస్తోంది. ఈ నేపథ్యంలో  అంజలికి మలయాళంలో ఓ గోల్డెన్ ఆఫర్ లభించింది. 
 
మలయాళ బిగ్ స్టార్ 'మమ్ముట్టి'తో నటించే అవకాశం అంజలిని వరించింది. అంజలి, మమ్ముట్టి నటిస్తున్న సినిమాకు జాతీయ అవార్డు గ్రహిత రామ్ దర్శకత్వం వహిస్తుండడం మరో విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరి మలయాళ కెరీర్ అంజలికి ఎలా అనుకూలిస్తుందో వేచి చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments