Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనోజ్ బాజపాయ్ మంచి నటుడే కానీ కేజ్రీవాల్‌ను మించిన నటుడేం కాదు : రాంగోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌ కథానాయకుడిగా ''సర్కార్‌-3'' చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అభిషేక్‌, ఐశ్వర్య నటించడం లేదని, కథను బట్టి ఆ నిర్ణయం తీసు

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:05 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌ కథానాయకుడిగా ''సర్కార్‌-3'' చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అభిషేక్‌, ఐశ్వర్య నటించడం లేదని, కథను బట్టి ఆ నిర్ణయం తీసుకున్నామని వర్మ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్ల‌డించాడు. కాగా సర్కార్‌-3 ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 26న విడుదల చేస్తున్నామని, కథపై కసరత్తు జరుగుతోందని వర్మ చెప్పాడు. 
 
గతంలో విడుదలైన ''సర్కార్''‌, ''సర్కార్‌-2''లతో పోలిస్తే ఈ చిత్రం మరింత భారీ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో హీరోయిన్‌గా గతంలో ఆయన జోక్స్ వేసిన యామీగౌతమ్‌ నటించనున్నట్లు రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకునే యువతిగా అను కర్కారే పాత్రలో యామీ నటిస్తున్నట్లు వెల్లడించారు. యామీ పాత్ర ఆకట్టుకుటుందని ఆయన తెలిపారు. అలాగే.. ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో వారి పాత్రల పేర్లతో సహా వర్మ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 
 
అమితాబ్‌ బచ్చన్‌: సుభాష్‌ నాగ్రే పాత్రలో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.
యామీ గౌతమ్‌: తండ్రిని చంపిన సర్కార్‌పై పగతీర్చుకునే యువతి అన్ను కర్కారే పాత్రలో నటిస్తోంది.
జాకీ ష్రాఫ్‌: సర్‌ అనే పాత్రలో నటిస్తున్నారు.
అమిత్‌ సాధ్‌: పొగరు, వాలటైల్‌ ఉండే శివాజీ అలియాస్‌ చీకూ పాత్రలో నటిస్తున్నారు.
మనోజ్‌ బాజ్‌పాయ్‌: గోవింద్‌ సర్కార్‌కి శత్రువుగా గోవింద్‌ దేశ్‌పాండే పాత్రలో నటిస్తున్నారు.
రోహిణి హట్టంగడి: రుక్కు బాయ్‌దేవి అనే విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.
భరత్‌ దబోల్కర్‌: గోరఖ్‌ రాంపూర్‌ అనే మంత్రి క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు.
రోనిత్‌ రాయ్‌: సర్కార్‌కి కుడి భుజంగా గోకుల్‌ సతమ్‌ పాత్ర పోషిస్తున్నారు.
అంతేకాకుండా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. ''మనోజ్‌ బాజపాయ్‌ చాలా బాగా నటిస్తున్నారు.. కానీ అరవింద్‌ కేజ్రీవాల్‌ కంటే మంచి నటుడైతే కాదు'' అంటూ వివాదాల వర్మ ట్వీట్‌ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments