Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతోడు... పవన్ కళ్యాణ్‌పై అలాంటి ట్వీట్లు చేయను : రాంగోపాల్ వర్మ

వివాదాస్పద ట్వీట్లతో చెలరేగిపోయే దర్శకుడు రాంగోపాల్ వర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వివాదాస్పట ట్వీట్లు చేయబోనని ఒట్టు వేశాడు. అయితే, తన ఒట్టుకు ఏ మేరకు కట్టుబడి ఉంటాడన్నది ఇపుడు సందేహాస్పందంగా మ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (17:18 IST)
వివాదాస్పద ట్వీట్లతో చెలరేగిపోయే దర్శకుడు రాంగోపాల్ వర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వివాదాస్పట ట్వీట్లు చేయబోనని ఒట్టు వేశాడు. అయితే, తన ఒట్టుకు ఏ మేరకు కట్టుబడి ఉంటాడన్నది ఇపుడు సందేహాస్పందంగా మారింది. 
 
సాధారణంగా అర్థరాత్రి దాటిన తర్వాత దేవుళ్లపై, స్టార్‌ హీరోలపై వివాదాస్పద ట్వీట్లు చేయడంలో రాంగోపాల్ వర్మకు మంచి పేరున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా మెగా హీరోలపై ఆయన చేసే ట్వీట్లు ఎంతో సంచలనం సృష్టించాయి. నటుడు నాగబాబు అయితే, రాంగోపాల్ వర్మపై మాటలతో యుద్ధం కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఒట్టు వేసుకున్నారు. 
 
‘నా వ్యాఖ్యాలతో బాధకు గురైన గణపతి భక్తులకు, పవన్‌కల్యాణ్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నాకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు. అందుకే మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్‌బర్గ్‌ మీద, అమితాబ్‌ బచ్చన్‌ మీద ఒట్టేసి చెబుతున్నాన’ని ట్వీట్‌ చేశాడు. బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమాల్‌ వల్లే తాను మారుతున్నట్టు చెప్పాడు.
 
కాగా, ఇలాంటి ఒట్టు వేసిన రెండు గంటల్లోనే బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌నుద్దేశించి రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ష్రాఫ్‌ను ఓ మహిళతో పోల్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments