Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీం పేరుతో ట్విట్టర్లో పోస్టర్ రిలీజ్.. రామ్ గోపాల్ వర్మ పనికానిస్తున్నాడా?

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ ఇటీవల గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీని తెరకెక్కించనున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. నయీంని ఇటీవలే పోలీసులు మట్టుబెట్టగా తెలుగు రాష్ట

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (09:59 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ ఇటీవల గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీని తెరకెక్కించనున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. నయీంని ఇటీవలే పోలీసులు మట్టుబెట్టగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన నడిపిన దందాల వ్యవహారం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో నేరచరిత్ర ఉన్న నయీం జీవితంపై సినిమా అంటే అభిమానులలోను ఒక రకమైన ఆసక్తి  పెరిగింది. ''సత్య'', ''రక్త చరిత్ర'', ''వంగవీటి'' సినిమాలను తనదైన స్టైల్‌లో రూపొందించే వర్మ నయీం జీవిత చరిత్రను ఏ విధంగా తెరకెక్కిస్తాడో అని అందరిలో ఆసక్తి రేగింది. 
 
నయీం నేరచరిత్ర గురించి మాటలకన్నా సినిమా ద్వారానే పూర్తిగా వివరించొచ్చని వర్మ ఆ మధ్య ట్వీట్ చేశారు. కాగా ఎక్కడైనా ఏదైనా సంచలనం జరిగితే చాలు వెంటనే దానిపై సినిమా ఎలా తీయాలా అని ఆలోచించడం ఈ దర్శకుడి ప్రత్యేకత. ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడిని సినిమాగా తీసిన వర్మ ఆ తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ ఆధారంగా పరిటాల రవి ముద్దలచెరువు సూరిల జీవిత గాథల ఆధారంగా రక్తచరిత్ర-1,2 సినిమాని తెరకెక్కించాడు. తర్వాత గంధపుచెక్కల గజదొంగ వీరప్పన్ సినిమానీ తెరకెక్కించాడు. తర్వాత బెజవాడ రౌడీయిజమ్ ఆధారంగా వంగవీటి మోహన రంగ జీవిత గాథను సినిమాగా తీస్తున్నాడు. 
 
ఒక రకంగా వర్మ తీసే హారర్ సినిమాల కంటే ఈ రియల్ బయోపిక్ సినిమాలే బాగుంటున్నాయి. తాజాగా నయీం పేరుతో వర్మ తన ట్విట్టర్‌లో ఓ పోస్టర్‌ని విడుదల చేశాడు. ఇందులో గ్యాంగ్‌స్టర్, రౌడీ, గూండా, అండర్ వరల్డ్, మాఫియా, ఫ్యాక్షనిస్ట్, టెర్రరిస్ట్, క్రిమినల్, నక్సలైట్, ఇన్‌ఫార్మన్ట్, క్రూయల్ ఇలాంటి పదాలన్నీ ఆ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ తను రూపొందించి కాదని ఎవరో సృజనాత్మకంగా ఈ పోస్టర్‌ని తయారు చేయగా అది తనకెంతో నచ్చి పోస్ట్ చేశానంటూ వర్మ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments