Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను దీపిక పదుకునేంత అందం కలగలిసిన తెలంగాణ బ్రూస్‌లీగా చూపిస్తా : రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. దేశంలోని సంచలన సంఘటనలు, నేరచరితులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఈ వివాదాస్పద దర్శకుడు... ప్రస్తుతం నిజజీవిత సంఘటన ఆధార

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (16:10 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. దేశంలోని సంచలన సంఘటనలు, నేరచరితులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఈ వివాదాస్పద దర్శకుడు... ప్రస్తుతం నిజజీవిత సంఘటన ఆధారంగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ చిత్రానికి ఆర్సీకే అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు.
 
ఈ చిత్రంలో కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉంటాయో చూపించబోతున్నట్టుగా తెలిపాడు. కేసీఆర్‌ను దీపిక పదుకునె అంత అందం కలగలిసిన తెలంగాణ బ్రూస్‌లీగా, మరే ఇతర రాజకీయ నాయకుడికి లేని లక్షణాలు ఉన్న వారిగా తన ఆర్‌సీకేలో చూపించనున్నట్లు వెల్లడించాడు. ఇంతవరకూ అందరికీ తెలిసిన కేసీఆర్, బయటకి కనిపించే కేసీఆర్ కాకుండా కేసీఆర్ ఆలోచనలు, కేసీఆర్ లోపలి నుంచి ఎలాంటి వారు అనేది తన సినిమాలో హైలైట్ అవుతాయని వర్మ ట్వీట్ చేశారు. 
 
'వంగవీటి' సినిమానే తన చివరి తెలుగు సినిమా అని గతంలో ప్రకటించిన రాంగోపాల్ వర్మ కేసీఆర్‌పై సినిమా తీస్తానని చెప్పడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కిస్తాడో లేక హిందీలో తెరకెక్కిస్తాడో తెలియదు కానీ వర్మ ప్రకటనతో తెలంగాణలోనే కాదు యావత్ సినీ ప్రపంచమే షాకైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments