Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ చరణ్ - సుకుమార్ చిత్రానికి టైటిల్ "పల్లెటూరి ప్రేమలు"?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మించనున్న ఈ చిత్రానికి అపుడే టైటిల్ వేట మొదలైంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (08:43 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మించనున్న ఈ చిత్రానికి అపుడే టైటిల్ వేట మొదలైంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తున్న వార్తల మేరకు... ఈ చిత్రానికి పల్లెటూరి ప్రేమలు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. 
 
ఎందుకంటే... సుకుమార్ దర్శకత్వంలో రానున్న మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఏ టైపులో ఉంటుందో కూడా అంచనా వేయలేకుండా ఉందని చెప్పాలి. చెర్రీ రెండు బిందెలు మోస్తున్న కావడి చూస్తుంటే ఈ మూవీ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోందో ఇట్టే అర్థమవుతోంది. ఏడేళ్ల పదేళ్ల కెరీర్‌లో చెర్రీ 'మగధీర', 'ఆరెంజ్' తర్వాత పక్కా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం మెగా వారసుడు లుక్ పరంగా మేకోవర్ చేయడం విశేషం. గుబురు గడ్డెంతో రామ్ చరణ్ లుక్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. 
 
దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌ని పక్కా పల్లెటూరి కుర్రాడి గెటప్‌లో చూపించబోతున్నాడు. ఇంతకు ముందు చెర్రీ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం పల్లెటూరు నేఫథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రానికి ఈ చిత్రానికి ఎక్కడపోలికలు లేవనేది ఫస్ట్ లుక్‌ని బట్టే తెలుస్తోంది. ఆన్ ఆఫిషియల్ టాక్ ప్రకారం ఈ చిత్రం పిరియడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు వినికిడి. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంతను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments