Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హాయ్ గైస్... బ్రేక్‌ఫాస్ట్‌ మిస్ కావొద్దు... సెంటిమెంట్‌తో కూడిన ప్రతిజ్ఞ చేసిన ఉపాసన.. ఎందుకు?

హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కువగా రాంచరణ్, అపోలో లేదా తన ఫ్యామిలీ, పర్సనల్ అంశాలకు సంబంధించ

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:40 IST)
హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కువగా రాంచరణ్, అపోలో లేదా తన ఫ్యామిలీ, పర్సనల్ అంశాలకు సంబంధించిన విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా ఆరోగ్యం మీద ట్విట్టర్‌లో సంచలన వాఖ్యలు చేసింది. సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే జరుపుకునే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం మీద.. ముఖ్యంగా గుండె కోసం ఏమేం చేయాలో తెల్లారేపాటికి మర్చిపోతూ ఉండడం కూడా కామన్. ఈసారి వరల్డ్ హార్ట్ డేని మర్చిపోకుండా ఉండేందుకు.. సెంటిమెంట్‌తో కూడిన ప్రతిజ్ఞ చేసింది రాంచరణ్ భార్య ఉపాసన. 
 
అంతేకాదు.. మనల్ని కూడా చేసేయమని సామాజిక మాధ్యమాల్లో తన దైన శైలిలో స్పందించింది. 'హాయ్ గైస్.. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేను మా నాన్న ఆరోగ్యం గురించి ప్రతిజ్ఞ తీసుకుంటున్నా. అయన ఎప్పుడూ బ్రేక్‌ఫాస్ట్‌ మిస్ కాకుండా చూస్తాను. 15 నిమిషాలు ఎక్సర్ సైజ్.. 10 వేల అడుగుల నడక ఉండేలా చర్యలు తీసుకుంటా. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా హెల్త్ చెకప్స్ చేయించాల్సిందే. 
 
సారీ చెప్పడం కంటే.. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. ఈ వరల్డ్ హార్ట్ డే రోజున మీ డాడ్ కోసం మీరేం చేయబోతున్నారు? లైఫ్ స్టైల్‌లో చిన్నపాటి మార్పులతో జీవితంలో సుదీర్ఘకాలం ఉపయోగపడే పెద్ద మార్పులను సాధించచ్చు. మనకందరికీ అవేంటో తెలుసు. వాటిని పాటించాలంతే' అంటూ సీరియస్‌గా అందరికి చిన్నపాటి క్లాస్ తీసుకుంది ఉపాసన. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments