Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ తాతయ్య కాబోతున్నారా? చెర్రీ-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారా?

మెగాస్టార్ చిరంజీవి తాతయ్య కాబోతున్నారని.. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చెర్రీ సతీమణి ఉపాసన గర్భం ధరించిందని.. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వను

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (17:50 IST)
మెగాస్టార్ చిరంజీవి తాతయ్య కాబోతున్నారని.. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చెర్రీ సతీమణి ఉపాసన గర్భం ధరించిందని.. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను చెర్రీ కొట్టి పారేసినట్లు కూడా ఆంగ్ల వెబ్ సైట్లు రాసేస్తున్నాయి. దీంతో ఈ వార్తల్లో ఏది నిజమంటూ మెగా ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు. 
 
ఏది ఏమైనా చెర్రీ తండ్రి కాబోతున్న వార్త నిజం కావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే చెర్రీ మాత్రం ఉపాసన గర్భం ధరించలేదని, తాను తండ్రి అయ్యే ఆ శుభవార్తను తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తానని చెర్రీ అన్నట్లు సమాచారం. 32 ఏళ్ల చెర్రీ 2011 సంవత్సరంలో ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మార్చి 27న చెర్రీ బర్త్ డేను జరుపుకోనున్నాడు. 
 
మరోవైపు ఉపాసన కూడా ఈ మధ్యే బరువు తగ్గింది. కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే పిల్లల విషయంలో గ్యాప్ తీసుకున్న చరణ్ దంపతులు.. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు రాగానే మెగా క్యాంపులో సందడి వాతావరణం నెలకొంది. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో? చెర్రీ మీడియా ముందుకు వచ్చి నోరు విప్పితే కానీ తెలియదు. కాగా ప్రస్తుతానికి రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments