Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గాలి' ఇంట డ్యాన్స్ చేసినందుకు ఎంత ముట్టింది? రకుల్ ప్రీత్ సింగ్‌కు ఐటీ నోటీసు

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. ఆమెకు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీచేసింది. ఇటీవల కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన వి

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (16:33 IST)
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. ఆమెకు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీచేసింది. ఇటీవల కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహ మహోత్సవానికి దక్షిణాదికి చెందిన రాజకీయ ప్రముఖులతోబాటు సినీ సెలబ్రిటీలకు కూడా హాజరయ్యారు. 
 
ఈ వివాహం కోసం ఏకంగా రూ.500 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకలో సందడి చేసిన కొంతమంది సెలబ్రిటీలకు భారీగా డబ్బులు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వేడుకలో డ్యాన్స్‌ చేసిన తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఒక్కొక్కరు కోటి రూపాయల మేరకు అందుకున్నట్టు వినికిడి. అందుకే ఇప్పుడు రకుల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
 
ఇప్పటికే గాలి వారింట పెళ్లిపై కన్నేసిన ఐటీ శాఖ.. ఆ పెళ్లికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తోంది. అలాగే డబ్బు పుచ్చుకున్న వారికి కూడా ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వచ్చాయట. అలా నోటీసులు అందుకున్న వారిలో రకుల్‌ కూడా ఉందని ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే రకుల్‌ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేస్తోంది. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, తను చాలా ప్యూర్‌ అని అంటోంది ఈ ఢిల్లీ బ్యూటీ. మరి, రకుల్‌ ఎంత ప్యూరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments