Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తెరపై కనిపించనున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' జోడీ

''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (11:18 IST)
''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జంట.. మళ్లీ వెండితెరపై కనిపించనుంది. 
 
గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య చైతూ-రకుల్‌కి ఓ కథ వినిపించిందని.. ఆ కథ కొత్తగా వుండటంతో ఇద్దరూ ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు పూర్తి చేసుకుని ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. 
 
మే లేదా జూన్ నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు-మూడు తమిళ సినిమాలు రకుల్ చేతిలో వున్నాయి. ఇక నాగచైతన్య ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు జరిగింది.. క్షమించండి.. అభిమానులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments